88 భారతీయ ఎయిర్ కండిషన్ బస్సులను ప్రారంభించిన బంగ్లాదేశ్‌

14 Jul, 2013 18:14 IST|Sakshi

ఢాకా: భారత్‌కు చెందిన ఆశోక్ లాయ్‌లాండ్ అనే సంస్ధ తయారుచేసిన 88 ఎయిర్ కండిషన్ బస్సులను బంగ్లాదేశ్ ప్రారంభించింది. ఈ సరికొత్త బస్సులను తయారుచేసేందుకు బంగ్లాదేశ్ భారత్‌తో 800 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ బస్సులను బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా తన గానోభాబాన్ అధికార నివాసంలో శనివారం ప్రారంభించినట్టు అక్కడి అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు. బంగ్లాదేశ్‌లో జరుగనున్న ఈద్ - ఉల్- ఫిట్ పండుగ సందర్భంగా ఈ ఎయిర్ కండిషన్ బస్సులనువినియోగించనున్నట్టు ఓ ఉన్నతాధికార మంత్రివర్గం ప్రకటనలో పేర్కొంది.

ఈ పండుగ సందర్భంగా దేశమంతటావేలాది మంది ముస్లింలు పాల్గొని ఉత్సవాల్లో పాల్గొన్న యాత్రికులను తిరిగి తమ నివాసాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా ఆ వాహనాలను వినియోగించనున్నట్టు తెలిపారు. కాగా, భారత్‌కు చెందిన ఆశోక్ లాయ్‌లాండ్ ఈ బస్సులను తయారుచేసి బంగ్లాదేశ్‌కు సరఫరా చేసింది. బంగ్లాదేశ్ రోడ్డు రవాణా సంస్థతో మూడు రకాల బస్సులను తయారుచేసేందుకు ప్రాజెక్ట్‌ను ఒప్పందం చేసుకుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం బంగ్లాదేశ్ 2010 ఆగస్టులో 290 డబుల్ డెక్కర్ బస్సులు, 50ఆర్టిక్యూలేటడ్ బస్సులు, 88 ఎయిర్ కండిషన్ బస్సుల కోసం 36.85 మిలియన్ల డాలర్లను భారత్‌కు చెల్లించింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ అక్టోబర్ 2012 నాటికి 290 బస్సులను బంగ్లాకు అందజేసింది. మరో 50 ఆర్టిక్యూలేటడ్ బస్సులను 2013 ఏప్రిల్ నాటికి అందజేసినట్టు భారత హైకమీషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో చివరి భాగంగా 88 బస్సులను భారత్ సంస్థ ఆశోక్‌లయ్‌లాండ్ బంగ్లాకు అందజేసింది.

మరిన్ని వార్తలు