మకావ్, సింగపూర్ లలో హోటళ్లు

29 Jun, 2013 16:49 IST|Sakshi

మకావ్ , సింగపూర్లో నూతనంగా రెస్టారెంట్లు ప్రారంభించనున్నట్లు భారతీయ ఇజ్రాయిల్ చెఫ్ రీనా పుష్కరణ్ శనివారం ఇక్కడ వెల్లడించారు. జులై రెండవ వారంలో వీటిని ప్రారంభిస్తామన్నారు. మధ్య ప్రాచ్యాదేశాల్లోని ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకం హలాల్ వేజిటేరియన్ను ఆ రెస్టారెంట్ ద్వారా భోజన ప్రియులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే మకావ్ లో మొదటి రెస్టారెంట్ను ప్రారంభిస్తున్నామన్నారు.

అలాగే సింగపూర్లో ఇది రెండో రెస్టారెంట్ అని తెలిపారు. అయితే పలు దేశాల్లో మరిన్ని రెస్టారెంట్లు ప్రారంభించాలని ఆయా దేశాల ప్రజల నుంచి తనపై ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆమె తెలిపారు. అయితే తన కుమారుడు ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కులినరీ కోర్సు చేస్తున్నారన్నారని తెలిపారు. అతడి కోర్సు పూరైన వెంటనే మరిన్ని రెస్టారెంట్లు ప్రారంభించాలని అనే అంశంపై స్పందింస్తానని తెలిపారు.  పంజాబ్కు చెందిన రీనా ఇజ్రాయిల్ వలస వెళ్లారు.

మరిన్ని వార్తలు