బ్రిటన్ కొత్త వీసా ప్రతిపాదనపై నివేదిక కోరిన భారత హై కమీషన్

26 Jun, 2013 16:48 IST|Sakshi

లండన్‌/న్యూఢిల్లీ: లండన్‌లో నవంబర్ నుంచి ప్రారంభం కానున్న ఆరు నెలల వీజిట్ వీసాపై భారత పౌరులనుంచి బ్రిటిష్ ప్రభుత్వం 3వేల పౌండ్స్(రూ. 2.8 లక్షలు) భారీ మొత్తంలో నగదు పూచీకత్తను చెల్లించాల్సిందిగా నిర్ణయించింది. అయితే ఈ ఆరునెలల విజిట్ వీసా ప్రతిపాదనపై భారత హైకమీషన్ బ్రిటిష్ ప్రభ్వుత్వం నుంచి అధికారక సమాచార నివేదకను కోరింది. యుకె ఈ పథకం అమలు చేయడానికి యోచిస్తున్నట్టు మీడియా నివేదకలో వెల్లడైంది. ఈ పథకంతో కొందరు భారత జాతీయులు లండన్ రావలంటే కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఉండచ్చొని మంగళవారం ఓ అధికారిక వర్గం వెల్లడించింది. ఈ సమాచారంతో రానున్న చిక్కులను అంచనా వేయవచ్చునని పేర్కొంది. దీనిపై ఇరుదేశాలు అధికారక చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపింది. ఈ చర్చ వచ్చేనెలలో జరిగే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

అయితే ఈ వీసా ప్రతిపాదన కింద లండన్‌కు వచ్చే సందర్శకులైన భారతీయులు, పాకిస్తానీలు, నైజేరియన్లు, ఆసియన్, ఆఫ్రికన్ దేశాలవారు భారీ మొత్తంలో నగదు పూచీకత్తను సమర్పించాల్సి ఉంటుంది. వారు లండన్‌లోకి ప్రవేశించే ముందు అక్కడి ప్రభుత్వం ప్రతిపాదనకు లోబడి వారంతా సుమారు 3వేలు పౌండ్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. సండే టైమ్స్ నివేదిక ప్రకారం.. నవంబర్‌లో భారత్‌తోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఘానా సహా 6 దేశాల సందర్శకులను లక్ష్యంగా చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వం ఆరునెలల విజిట్వీసా పథకాన్ని ప్రారంభినున్నట్టు తెలిపింది. తమదేశానికి వచ్చే సందర్శకుల వయస్సు 18సంవత్సరాలు నిండిఉండాలని పేర్కొంది. కాగా, ఈ ప్రతిపాదనపై భారత్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. దీనివల్ల భారత్‌కు, బ్రిటన్‌కు మధ్య సంబంధాలు మందగించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు