ఎన్నారైకు రూ. 60లక్షల కమిషన్ జాక్‌పాట్

11 Jul, 2013 16:03 IST|Sakshi

జాక్‌పాట్ తగిలిన ఓ లాటరీ టికెట్‌ను అమ్మిన భారతీయ అమెరికన్‌కు రూ.60 లక్షల భారీ కమీషన్ దక్కనుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో బీరు షాపు నడుపుతున్న గేరీ పటేల్(30) ఇటీవల తన షాపులో పవర్‌బాల్ లాటరీ టికెట్లు అమ్మాడు. వాటిలో ఓ టికెట్‌కు రూ.780 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. దాన్ని గెల్చుకున్న విజేత పేరు తెలియరాలేదు. తనకొచ్చే కమీషన్‌ను తన షాపులో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు బోనస్‌గా ఇస్తానని పటేల్ చెప్పాడు. తాను అమ్మిన టికెట్‌కు లాటరీ తగిలిందని లాటరీ అధికారి తన షాపుకొచ్చి చెప్పినప్పుడు నమ్మలేకపోయానన్నాడు.

మరిన్ని వార్తలు