లాటరీ టికెట్‌.. కోటీశ్వరులైన స్నేహితులు

11 Apr, 2018 12:04 IST|Sakshi

సాక్షి, దుబాయ్ : కేరళలోని త్రిస్సూర్‌కి చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులను అదృష్టం వరించింది. చిన్నప్పటి నుంచి ఒకే ప్రాంతంలో పెరిగి, ఒకే స్కూల్‌లో విద్యనభ్యసించిన ఫ్రాన్సిస్‌ సెబాస్టియన్‌, పింటో పాల్‌ తొమ్మాన తలరాతను ఓ లాటరీ టికెట్‌ మార్చేసింది. చిన్నఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వీరిని దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ సంస్థ కోటీశ్వరులని చేసింది. సెబాస్టియన్‌, తొమ్మాన ఇద్దరు కలిసి గత నెలలో టికెట్‌ కొనుగోలు చేశారు. వీరు కొనుగోలు చేసిన టికెట్‌ నెంబర్‌ 2465 లక్కీ డ్రాలో 1 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు ‌(రూ.ఆరున్నర కోట్లు) నగదు బహుమతికి ఎంపికైంది.

తొమ్మాన షార్జాలో మెకానిక్‌గా పని చేస్తుంటే, అతని భార్య ధన్య దెవాసి స్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. తొమ్మాన 12 ఏళ్లుగా యూఏఈలోనే ఉంటున్నారు. సెబాస్టియన్‌ అరేబియన్‌ ఆటోమొబైల్స్‌లో పని చేస్తున్నారు. ఇద్దరు ప్రాణస్నేహితులకు లక్కి లాటరీ తగలడం, అదే రోజు(ఏప్రిల్‌ 10) సెబాస్టియన్‌ భార్య లియోనీ ఫ్రాన్సిస్‌ పుట్టిన రోజు కూడా కావడంతో వారి ఆనందానికి అవుధులు లేకుండాపోయింది.  

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా