దుబాయ్‌లో జగిత్యాల వాసి దుర్మరణం

9 Aug, 2019 20:46 IST|Sakshi

దుబాయ్‌ : దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతి చెందిన వ్యక్తిని జగిత్యాల వాసి గంగాధర్‌గా అధికారులు గుర్తించారు. దుబాయిలోని ఓ కంపెనిలో బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న గంగాధర్‌ ఈ నెల  5న మృత్యవాత పడినట్లుగా సమాచారం. వివరాలు..జగిత్యాల జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన గంగాధర్‌ దుబాయ్‌లోని సోనాపూర్‌ సప్లై కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కంపెనీలో పని చేసే ఎంప్లాయిస్‌ని పనిలో దింపి తిరిగి వస్తుండగా బస్సు బొల్తాపడి డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గంగాధర్‌ మంటల్లో చిక్కుకుని మరణించాడు.

గంగాధర్‌ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు బోరున విలపించడంతో అక్కడ విషాదం అలుముకుంది. మృతి చెందిన గంగాధర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, దుబాయ్‌లోని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా విపుల్‌, సీఎం కేసీఆర్‌లు, నిజామాబాద్‌ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్‌లను మంద భీంరెడ్డి ట్విటర్‌ ద్వారా కోరారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు