లాటరీల్లో భారతీయులను వరిస్తున్న అదృష్టం

6 May, 2019 12:05 IST|Sakshi

దుబాయి: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన భారతీయులకు ఈ మధ్య లాటరీలు బాగానే తగులుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన డ్రైవర్‌ జాన్‌ వర్గీస్‌ ఓ లాటరీలో రూ.80 కోట్లకుపైగా గెలుచుకున్నాడు. తాజాగా మరో భారతీయుడికి (4 మిలియన్‌ అమెరికా డాలర్ల) రూ.27.7 కోట్ల విలువైన లాటరీ తగిలింది. యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేసిన అబుదాబి డ్యూటీ ఫ్రీ బిగ్‌ టికెట్‌ సిరీస్‌ డ్రాలో షార్జాలో నివసిస్తున్న భారతీయుడు షోజిత్‌ కేఎస్‌ భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు.  

షోజిత్‌ గతనెల 1వ తేదీన ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. అయితే లాటరీ తగిలిన విషయం షోజిత్‌కు తెలియక నిర్వాహకులను సంప్రదించనే లేదట. దీంతో నిర్వాహకులే స్వయంగా షోజిత్‌ ఇంటికి వెళ్లి, లాటరీ మొత్తాన్ని అందజేశారు. ఇక ఇదే లాటరీ లక్కీ డ్రాలో బహిష్కృత భారతీయుడు మంగేశ్‌ మైందె బీఎండబ్ల్యూ కారును దక్కించుకున్నాడు. మరో ఎనిమిదిమంది భారతీయులతోపాటు ఒక పాక్‌ పౌరుడు కూడా ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా