ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది

16 Jul, 2013 17:16 IST|Sakshi

ఆస్ట్రేలియాలోని ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే భారతీయ విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగిందని తాము చేపట్టిన సర్వే ద్వారా వెల్లడైందని మంగళవారం ఓ సంస్థ మెల్బోర్న్లో వెల్లడించింది. 'ఇండియన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా: దేయర్ ప్యాట్రన్స్ అండ్ మోటివేషన్స్' పేరిట నిర్వహించిన సర్వే నివేదికను 'ఆస్ట్రేలియన్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్'లో ప్రచురించింది.

 

దేశ ఇమ్మిగ్రేషన్ విధానంలో ఇటీవల చేపట్టిన మార్పుల వల్లే ఇది సాధ్యమైందని ఆ సర్వే నివేదిక అభిప్రాయపడింది. అయితే ఆస్ట్రేలియాలో ఐటీ కోర్పులు అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు అమితాసక్తి కనబరుస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా క్రోకరీ, హెయిర్ డ్రెసింగ్ కోర్సులల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొంది. గతంలో ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు తీవ్ర అనాసక్తి కనబరుస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఇమ్మిగ్రేషన్ నిబంధనలల్లో మార్పులకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్షిప్ (డీఐఏసీ) శ్రీకారం చూట్టింది. భారతీయ విద్యార్థుల ఆశలకు, అకాంక్షలకు అనుగుణంగా డీఐఏసీ ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు చేసింది. దీంతో భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు క్యూ కడుతున్నారు.

 

అందుకు సంబంధించి పలు గణాంకాలను సోదాహారణగా ఆ సర్వే తన నివేదికలో వెల్లడించింది. ఏడాది మే వరకు దాదాపు నాలుగు వేలమంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు వివిధ విద్యాసంస్థల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొంది. అయితే గతేడాది ఇదే సమయంలో తమ పేర్లను నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల కంటే ఇది 43.9 శాతం అధికమని ఆ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు