లక్కీ డ్రాలో.. భారతీయులకు జాక్‌పాట్‌

5 Mar, 2018 15:59 IST|Sakshi
విజేతలను ప్రకటిస్తున్న నిర్వాహకుడు( ఇన్‌ సెట్‌లో థాన్సిలాస్‌ బాబు మాథ్యూస్ )

దుబాయి:  అబుదాబి ‘బిగ్‌ టికెట్‌ లక్కీ డ్రా’లో భారతీయులకు జాక్‌పాట్‌ తగిలింది. ఈ లక్కీ డ్రా వరించిన 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు. సోమవారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది.  కేరళకు చెందిన థాన్సిలాస్‌ బాబు మాథ్యూస్ 7 మిలియన్ల దినార్‌లు (దాదాపు 12.5 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ లాటరీ తగటడం  నమ్మలేకపోతున్నానని థాన్సిలాస్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత నెలలో రాఫెల్‌ బొనాంజా బిగ్‌ లక్కీ మిలియనీర్‌ లాటరీ టికెట్‌ నెంబర్‌ 030202 కొనుగోలు చేయగా, డ్రాలో పెద్ద మొత్తమైన 12.5 కోట్లు గెలుచుకున్నాడు.

ఇదే డ్రాలో మరో ఆరుగురు భారతీయులు ఒక్కొక్కరు దాదాపు 18 లక్షలు గెలుపొందారు. బిగ్‌ టికెట్‌ లక్కీ డ్రా విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, బెహ్రెయిన్‌ కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

బిగ్‌ టికెట్‌ లక్కీ డ్రా విజేతలు వీరే..

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా