సింగపూర్​లో వైభవంగా సాహిత్య సమ్మేళన వేడుకలు

6 Jul, 2020 16:33 IST|Sakshi

సింగపూర్: శ్రీ సాంస్కృతిక కళా సారథి సంస్థ ఆవిర్భావ సందర్భంగా సింగపూర్​లో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య సమ్మేళన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి.  ఆసాంతం రమ్యంగా సాగిన తెలుగు సాహిత్యారాధనలో వక్తలు తమ వ్యాసాలను, కవితలను, పద్యాలను, పాటలను శ్రోతలకు వినిపించారు.

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాభినందనలతో కూడిన లేఖను పంపారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, గరికిపాటి నరసింహారావు వారి సందేశాలను పంపారు. కార్యక్రమ విశిష్ట అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్​ మాధవ్ ‘జూమ్​’ద్వారా పాల్గొని ప్రసంగించారు. 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు రాజా గౌరవ అతిథులుగా పాల్గొని తెలుగు సాహిత్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కంభంపాటి సోదరులు, రెలారే రెలా జానకీరావు, రాంబాబు పద్యాలతో అలరించారు. ‘అలా సింగపురంలో..’పేరుతో తెలుగు సంస్కృతి గొప్పదనంపై తీసిన లఘు చిత్రం ట్రైలర్​, సంస్థ వెబ్​సైట్, ఆస్ట్రేలియాకు చెందిన ఉమా మహేశ్ రాసిన ‘అక్షరోద్యమం’ అనే పుస్తకాన్ని రామ్​మాధవ్ సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సింగపూర్ నుండి భాస్కర్, అరుణ్, రాధాకృష్ణ,శిల్ప, ప్రావీణ్య, స్వాతి, శ్రీనివాస్ జాలిగామ, లక్ష్మి ప్రసాద్ రెడ్డి, రాధా శ్రీనిధి, వేణు మాధవ్, పాటూరి రాంబాబు, ఆస్ట్రేలియా నుండి కొంచాడ రావు, న్యూజిలాండ్ నుండి జగదీశ్వరరెడ్డి దంపతులు, హాంకాంగ్​ నుండి జయ, యూకే నుండి జొన్నలగడ్డ మూర్తి, మలేసియా నుండి అచ్చయ్య కుమార్ రావు, కువైట్ నుండి వీర నరసింహరాజు, భరతభూమి నుండి లావణ్య, సూర్యప్రకాశరావు, రవీంద్ర బాబు, శివ శంకర్, ఖతార్, దక్షిణాఫ్రికా, ఒమన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన రచయితలు పాల్గొన్నారు.

కార్యక్రమ ముఖ్యనిర్వాహకుడిగా కవుటూరు రత్నకుమార్, సాంకేతిక నిర్వహణ బాధ్యతలను భాస్కర్​, రాధాకృష్ణ నిర్వర్తించగా, వ్యాఖ్యాతగా రాధిక, సహ వ్యాఖ్యాతగా  రామాంజనేయులు, నిర్వాహక వర్గ సభ్యులుగా శ్రీధర్, రాంబాబు, సుధాకర్​ సేవలందించారు.‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సంస్థ ద్వారా భవిష్యత్​లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి వర్ధమాన కళాకారులను, రచయితలను ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు. దాదాపు 14 దేశాల నుంచి సాహితీవేత్తలు హాజరైన సభగా, తెలుగు బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో ఈ కార్యక్రమానికి చోటు దక్కిందని సంస్థ అధ్యక్షుడు వెంటాచారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు