వేట ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

11 Mar, 2020 14:25 IST|Sakshi

డాలస్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (వేట) ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌ నగరంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా వేట అధ్యక్షులు ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పవర్‌ ఆఫ్‌ ఉమెన్‌  అనే అంశంపై చర్చ కొనసాగించారు. అనంతరం ఐదు గంటలకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

కాగా కార్యక్రమానికి ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌) పూర్వాధ్యక్షులు కృష్ణవేణి రెడ్డి శీలం సమన్వయకర్తగా వ్యవహరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను ఆటా, టాంటెక్స్‌ పూర్వాధ్యక్షులు డాక్టర్‌ సంధ్య గవ్వ వివరించారు. దాదాపు ఈ కార్యక్రమానికి ఐదు వందల మందికి పైగా హాజరయ్యి సభను జయప్రదం చేశారు.  ఈ కార్యక్రమం విజయం వెనుక శ్రమించిన అను బెనకట్టి, లక్ష్మి పాలేటి, ఇందు మందాడి, సురేశ్‌ పఠానేని, మల్లిక్‌ రెడ్డి కొండ, అభితేజరెడ్డి, ప్రసన్న దొంగూర్‌, శ్రీలక్ష్మి మండిగ, కల్పన గనపురం, మాదవిరెడ్డి, లతా గదెద​, వాణి ద్రోణవల్లి, రాధా బండాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర దర్శకురాలు నందినిరెడ్డి, సీనియర్‌ హీరోయిన్‌ మీనాక్షి శేషాద్రి, పీడియాటిక్‌ అనస్థీషియాలజిస్ట్‌ డా. అనుమప గోటిముకుల, ప్రముఖ టెక్సస్‌ న్యాయవాది యూఎస్‌ఐసీవోసీ అధ్యక్షులు నీల్‌ గోనుగుంట్ల, ఆటా, నాటా, టాంటెక్స్‌. నాట్స్‌, తదితరులు పాల్గొన్నారు.  ఇక చివరగా వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించిన లిటిల్‌ జెమ్స్‌ నుంచి ప్రత్యూష, ఫోర్‌ పాయింటర్స్‌ షెటరాన్కు చెందిన సారా, అరుణ్‌ విట్టలకు  వేట అధ్యక్షులు ఝాన్సీ రెడ్డి  కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు