మిస్టరీగా మారిన శ్రీహర్ష ఆచూకీ

4 Sep, 2019 11:22 IST|Sakshi
శ్రీహర్ష(ఫైల్‌)

సాక్షి, ఖమ్మం (మామిళ్లగూడెం): గత నెల 21న లండన్‌లో కనిపించకుండాపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్‌ కుమారుడు ఉజ్వల శ్రీహర్ష ఆచూకీ మిస్టరీగా మారింది. లండన్‌లో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లి అదృశ్యమైన విషయంలో నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. మంగళవారం ప్రసాదసాధనలో శ్రీహర్ష మృతదేహం లభించినట్లు ఆయన కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. అయితే లండన్‌లోనే ఉన్న శ్రీహర్ష తండ్రి సన్నె ఉదయ్‌ప్రతాప్‌ మాత్రం లండన్‌ బీచ్‌లో అభించిన మృతదేహం తమ కుమారుడిది కాదని, ఇంకా పోలీసులు నిర్దారణ చేయలేదన్నారు.

ఆ మృతదేహానికి కొద్దిదూరంలో శ్రీహర్షకు సంబంధించిన పర్సు మాత్రమే లభించిందని, దీని ఆధారంగా మృతదేహం అని చెప్పడానికి అవకాశంలేదని లండన్‌ పోలీసులు చెప్పారన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు మృతదేహాన్ని డీఎన్‌ఏ టెస్ట్‌కు పంపించారని శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్‌ లండన్‌ నుంచి ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించారు. శ్రీ హర్ష ఆచూకీ కోసం అండన్‌లోని తెలుగువారి సహాయంతో ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈలోగా లభించిన మృతదేహం డీఎన్‌ఏ టెస్టు   పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీంతో శ్రీహర్ష ఆచూకీ లభ్యత మిస్టరీగా మారింది.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేశా.. టీడీపీపై ఫైర్‌

భారతీయులదే అగ్రస్థానం..

మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్‌ హౌస్‌’

మేం క్షేమం.. మరి మీరు?

తెలుగువారికి అండగా..

సినిమా

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

రియల్‌ 'హీరో'ల్‌

నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం