కీరవాణి రాగంతో ఎన్నారైలు ఆనందపరవశం

27 Jul, 2013 15:50 IST|Sakshi
న్యూజెర్సీలోని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సారథ్యంలో నిర్వహించిన సంగీత విభావరి.

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సారథ్యంలో నిర్వహించిన సంగీత విభావరి న్యూజెర్సీలోని తెలుగు ఎన్నారైలను ఆనందపరవశుల్ని చేసిందని నాట్స్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నగరంలోని రారిటన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో గత శనివారం నిర్వహించిన కీరవాణి విభావరికి పెద్ద ఎత్తున ఎన్నారైలు హాజరయ్యారని తెలిపింది.

 

కీరవాణి సంగీత విభావరీ స్థానిక ఎన్నారై తెలుగు ప్రజలకు ఓ ఆమూల్యమైన కానుక అని నాట్స్ ఈ సందర్భంగా పేర్కొంది. భారత్లోని అనాధ పిల్లల జీవితాల్లో అక్షర వెలుగులు నింపేందుకు 'హెల్ప్ పౌండేషన్' పాటుపడుతోంది. ఆ ఫౌండేషన్కు నిధులు సమీకరించేందుకు ఆ సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు నాట్స్ తెలిపింది.

 

అసోసియేషన్ ప్రతినిధులు అప్పసాని శ్రీధర్, మోహన కృష్ణ మన్నవ, మధు కొర్రపాటి, విమల్ కావూరి, అరుణ గంటిలు ఈ సంగీత విభావరి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోపించారని నాట్స్ పేర్కొంది. తెలుగు ఫైన్ ఆర్ట్ సొసైటీ ఎంతో ఉత్సాహంగా ఈ సంగీత విభావరిని విజయవంతం చేసేందుకు తనవంతు పాత్ర పోషించిందని తెలిపింది. ఆటా, నాటా, తానా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు  గంగాధర్ దేసు ఆహ్వానితులకు వివరించారు.

 

రంజిత్ చాగంటి, శ్రీ హరి మందాడి, ఎన్ ఆర్సీ నాయుడు,  వాసు తుపాకుల, వేణు పాల్యం, మంజు భార్గవ, వసంత్ తన్నా, వెంకటేశ్వరరావు వక్కలగడ్డ, దాము గేదెల, రాజ్ అల్లాడ, చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, ప్రసాద్ గుర్రం, సూర్య ప్రకాశ్ గంటి.. మురళీ మేడిచర్ల, శ్రీనివాస్ వెంకట, రామానాయుడు కంటుభుక్త , ప్రసాద్ బొబ్బ, శ్రీధర్ దోనేపూడి, హరికృష్ణ వీరవల్లి, మూర్తి పంతుల, హరి కొల్లూరి, ఫణి కడియాల, జయప్రకాష్ గుత్తా, ఆషా వైకుంఠం, రేఖ ఉప్పలూరి, శ్యామ్  నాళం, శంకరరావు పోలేపల్లి, మాధవి పోలేపల్లి, సత్య నేమాన, సురేష్  మాకం, సుధాకర్ ఉప్పల, శ్రీనివాస్ గండి, బిందు మాదిరాజు, ఉమ మాకం తదితరులు కీరవాణి సంగీత విభావరి భారీ ఎత్తున విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

 

 

మరిన్ని వార్తలు