మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

15 Oct, 2018 08:56 IST|Sakshi

కౌలాలంపూర్‌ : మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మలేషియా కౌలాలంపూర్‌లోని పీపీపీఎమ్‌ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు భారీగా తరలి వచ్చారు. సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరమళ్ళ ప్రకాష్ రావు, ఇండియన్ కౌన్సిలర్ అఫ్ మలేషియా నిషిత్ కుమార్ ఉజ్వల్‌తోపాటూ పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదినం కావున భారత ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పొడుగునా గాంధీ జన్మదిన వేడుకల్ని జరపాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా  మలేషియా తెలంగాణ అసోసియేషన్, ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సంయుక్తంగా గాంధీపైన వీడియో ప్రెజెంటేషన్, పిల్లలకు వ్యాస పోటీలు, క్విజ్‌లలో పాల్గొన్న వారికి, విజేతలకు బహుమతులను అందజేశారు. లక్కీ డ్రా విజేతలకు, అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి ముఖ్య అతిథు చేతుల మీదుగా 6 గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు.

ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ, తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ మొట్టమొదట మలేసియా వచ్చినపుడు ఏర్పాటు చేసిన మొదటి సమావేశం తరువాత మొదటి బతుకమ్మ వేడుకలతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగానిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అభినందించారు.  

మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రారంభం కావడానికి కృషిచేసిన వ్యక్తి ప్రకాష్ అని అన్నారు. ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు తెలుగు వారు ఉండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ  కార్యక్రమానికి   ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన స్పేస్ విజన్ గ్రూప్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కో స్పాన్సర్స్ జాస్ బెలూన్ అండ్ డెకొరేటర్స్, సంక్రాంతి ఇండియన్ క్యూసిన్, ప్రబలీ రెస్టారెంట్, మై 81రెస్టారెంట్, తడ్కా, ఎమ్‌టీఆర్‌ స్పైసెస్‌లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మసంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ 2018-2020 కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నికయింది. బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రకాష్ రావు ప్రకటించారు.  

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు  
ప్రెసిడెంట్ - సైదం తిరుపతి 
డిప్యూటీ ప్రెసిడెంట్ - చొప్పరి సత్య 
వైస్ ప్రెసిడెంట్ - బూరెడ్డి మోహన్ రెడ్డి 
వైస్ ప్రెసిడెంట్ - నరేంద్రనాథ్ 
జనరల్ సెక్రటరీ - రవి చంద్ర 
జాయింట్ సెక్రటరీ - సందీప్ 
ట్రేసరర్- మారుతీ 
జాయింట్ ట్రేసరర్ - రవీందర్ రెడ్డి   
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 
-రవి వర్మ,కృష్ణ వర్మ,కిరణ్ గాజంగి,హరి ప్రసాద్,వివేక్,రాములు,సుందర్,కృష్ణ రెడ్డి
ఉమెన్స్ వింగ్ 
ప్రెసిడెంట్ - కిరణ్మయి 
వైస్ ప్రెసిడెంట్ - స్వప్న 
వైస్ ప్రెసిడెంట్ - అశ్విత  
యూత్ వింగ్ 
యూత్ ప్రెసిడెంట్ - కార్తీక్ 
యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్ 
యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ 
 కల్చరల్ వింగ్ మెంబర్స్ 
-విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్ , రంజిత్ , సంతోష్ , ఓం ప్రకాష్, అనూష ,దివ్య , సాహితి , సాయిచరని, ఇందు.   
మైగ్రంట్ వింగ్ మెంబర్స్ 
-ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా