ఆదర్శ మాతృమూర్తులకు అవార్డ్స్‌ ప్రధానం

22 May, 2020 21:02 IST|Sakshi

నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (నాటా) అధ్వర్యంలో 'మదర్స్‌ డే' వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాటా డీసీ మెట్రో వారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నలుగురు ఆదర్శ మాతృమూర్తులను గుర్తించి వారికి గౌరవ ప్రదమైన ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలతో సత్కరించడం రివాజుగా మారింది. అందులో భాగంగానే ఈసారి కూడా అమెరికా రాజధాని పరిసర ప్రాంతాల తెలుగు  సేవా సంస్థలైన తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) అధ్యక్షురాలు కవితా చల్లా, బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్‌) అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, వారధి అధ్యక్షురాలు పుష్యమి దువ్వూరి, ఉజ్వల ఫౌండేషన్‌ అధ్యక్షురాలు అనిత ముత్తోజు, రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్‌) అధ్యక్షురాలు సుధారాణి కొండపులను ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరంతా తమ కుటుంబ బాధ్యతలే కాక వృత్తి, వ్యాపారాలకు న్యాయం చేస్తూనే అనేక సేవాకార్యక్రమాలతో ఆడదంటే అబల కాదు అని నిరూపిస్తున్నారు. వారిని ఈ ప్రపంచానికి ఆదర్శంగా చూపిస్తూ మదర్స్‌ డే రోజున వారందరికీ ఆదర్శ మాతృమూర్తి గౌరవ పురస్కారాలను అందజేశారు. 

కార్యక్రమానికి నాటా ఉమెన్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ సుధారాణి సారధ్యం వహించారు. సంధ్య బైరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని టీవీ ఏషియా తెలుగు ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. రితిక స్వాగత గీతం పాడగా.. ఆర్‌వీపీ అనిత నాటా సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఆర్‌వీపీ చైతన్య నాటా ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్ వారికి, లోకల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌లకు,  రీజినల్ కోఆర్డినేటర్స్‌కు, నాటా నాయకులు  సోమవరపు శ్రీనివాసులు రెడ్డి(సంయుక్త కార్యదర్శి), బోర్డు సభ్యులు సతీష్ నరాల, కిరణ్ గుణ్ణం, బాబూ రావు సామల, కలాడి మోహన్‌, మీడియా మిత్రులకు, నాటా శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా  కృతజ్ఞతలు తెలియజేశారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా