ఆకస్మిక హృద్రోగ సమస్యలపై అవగాహన

10 Apr, 2019 20:36 IST|Sakshi

ప్రాణ రక్షణ ప్రక్రియలో (పిపిఆర్‌) నాట్స్ , టాంటెక్స్ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా శిబిరాం 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరియు ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్) సంయుక్తంగా ‘ప్రాణ రక్షణ ప్రక్రియలో శిక్షణ’ (సిపిఆర్‌ ట్రైనింగ్‌) కార్యక్రమాన్ని శనివారం అర్వింగ్ లోన బిర్యానీ పాట్‌ ప్రాంగణంలో నిర్వహించారు. ఆకస్మికంగా గుండె ఆగి కుప్పకూలి మరణించిన వారి గురించి మనం నిత్యం వింటూ ఉంటాము. ఇలాంటి సంఘటన బహిరంగ ప్రదేశంలో జరిగితే ఎలా స్పందించాలో మనలో చాలామందికి తెలియదంటే ఆశ్యర్యం లేదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరు శాత్ం మాత్రమే ఇలా బహిరంగ ప్రదేశంలో కుప్పకూలినా.. మరణం నుంచి తప్పించుకున్నట్లు గణాంకాలు చెబుత్నున్నాయి. సరైన సమయానికి ప్రాణ రక్షణ ప్రక్రియలో అవగాహన లేకపోవడం ప్రధాన కారణమని నిపుణుల అభిప్రాయం. సిపిఆర్‌ శిక్షణలో ధృవీకృత నిపుణుడు టాంటెక్స్‌ దీర్ఘకాల సభ్యుడు కిషోర్‌ చుక్కల నేతృత్వంలో తెలుగు వారు మూడు విడుతులుగా విచ్చేసి ఇందులోని మెళుకువలను అభ్యసించారు. 

నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మంచికలపూడి నాట్స్ అధిపతి శ్రీనివాస్‌ గుత్తికొండ తమ సంయుక్త సందేశంలో తెలుగు వారందరినీ ఒక వేదికపై కలిసి చిన్నారులకు, యువతకు మన సంస్కృతిని పరిచయం చెయ్యాలని, తెలుగు వారి ఐక్యతకు కృషి చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు ఆకస్మిక హృద్రోగ సమస్యలకు మంచి అవగాహనను కలిగిస్తాయన్నారు.

6వ అమెరికా సంబరాల నాయకత్వం బృందం సభ్యులు కిశోర్‌ కంచెర్ల (అధిపతి), విజయ శేఖర్‌ అన్నె (సంయుక్తాధిపతి), ఆది గెల్లి (ఉపాధిపతి), ప్రేమ్‌ కలిదిండి (ఉపాధిపతి), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్‌ అదిభట్ట (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయ విక్రేయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్‌ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు) చినసత్యం వీర్నపు (టాంటెక్స్‌ అధ్యక్షుడు) సంయుక్తంగా ప్రాణ రక్షణ శిక్షణకు విచ్చేసిన తెలుగు వారికి అభినందనలు తెలియజేసి, తెలుగు వారందరినీ సంబరాలకు ఆహ్వానించారు. 

నాట్స్ సంబరాల కోశాధికారి బాపు నూతి సంస్థకుద సంబంధించిన ముఖ్యాంశాలను పంచుకుని ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ సంయుక్తంగా తెలుగు వారికి అందించండం సంతోషంగా ఉందన్నారు. సంబరాల కార్యదర్శి రాజేంద్ర మాదాల ప్రస్తుత సంబరాల కార్యక్రమ వివరాలను తెలియజేశారు. టాంటెక్స్‌ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. ప్రాణ రక్షణ ప్రక్రియలో శిక్షణ మన భారతీయ సంతతికి చెందిన వారికి, ముఖ్యంగా తెలుగు వారికి చాలా ముఖ్యమని, ఇటీవల మనం అనేక ఆకస్మిక మరణాలను చూశామని, ఇలాంటి శిక్షణలో తగిన అవగాహన అందించడం ద్వారా అతివిలువైన ప్రాణాన్ని కాపాడగలమన్నారు. టాంటెక్స్‌ కార్యదర్శి ఉమా మహేష్‌ పార్నపల్లి, కార్యనిర్వహక సభ్యులు శ్రీకాంత్‌ రెడ్డి జొన్నాల, సతీష్‌ బండారు కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు