నాట్స్‌ ఆధ్వర్యంలో ‘ట్రస్ట్ అండ్ విల్’

20 Mar, 2018 13:32 IST|Sakshi

కుటుంబ న్యాయపరమైన అంశాలపై అవగాహన

టెంపా:  అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నార్త్‌ అమెరికా తెలుగు సోసైటీ(నాట్స్‌)  తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ‍క్రమంలోనే నాట్స్‌ చాప్టర్‌ ట్రస్ట్‌ అండ్‌ విల్‌ అనే సదస్సును నిర్వహించింది.  ఆస్తులకు సంబంధించిన వీలునామాలు, బ్యాంక్‌ అకౌంట్లు ప్రారంభించేటప్పుడు నామినీల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తులు తమ వారసులకు ఎలా సంక్రమించాలి అనే కుటుంబ న్యాయపరమైన అంశాలపై చర్చించారు.

ఈ సమావేశానికి అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు డెనీస్‌.ఎస్‌.మెజస్‌ హజరయి సందేహాలు తీర్చారు. ఆరోగ్యం, రక్షణ, జాగ్రత్తలుపై కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది. డా.పరిమి,  ప్రశాంత్ పిన్నమనేని లు అటార్నీ డెనీస్.ఎస్. మెజస్ ను మెమెంటో తో సత్కరించారు. ఈ సదస్సును నిర్వహించినందుకు టెంపా టీంని నాట్స్‌ అభినందించింది. నాట్స్ టెంపా ఛాప్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మల్లాది ఆధ్వర్యంలో జరిగిన  ఈ సదస్సుకు స్థానిక తెలుగు వారితో పాటు, అమెరికన్లు పాల్గొన్నారు.

ఈ సదస్సుకు నాట్స్‌ చైర్మెన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ, నాట్స్‌ ప్రెసిడెండ్‌ మోహన్‌ మన్నన, నాట్స్ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు కొత్త శేఖరం, నాట్స్ టెంపా ఛాప్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మల్లాది, టెంపా నాట్స్‌ చాప్టర్‌ కార్యదర్శి ప్రసాద్‌ కొసరాజు, నాట్స్ సభ్యులు శ్రీనివాస్ నన్నపనేని, రమేష్ కొల్లి, శ్యాం తంగిరాల, యుగంధర్ మునగాల, మధు తాతినేని, సుధీర్ మిక్కిలినేని, మాలినీ రెడ్డి, రమా కామిశెట్టి, శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ గౌరవెల్లి, శ్రీనివాస్ అచ్చిరెడ్డి పలువురు నాట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు