టెంపాలో నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు 

15 Jun, 2019 13:14 IST|Sakshi

ఆరోగ్యం, జీవనశైలి మార్పులపై సూచనలు

ఫ్లోరిడా : అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలతో దూసుకువెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. తాజాగా టెంపాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ సదస్సుకు హాజరై విలువైన అంశాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంగా పదికాలాల పాటు ఎలా ఉండాలనే దానిపై స్థానిక ప్రముఖ వైద్యులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర శాస్త్రి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సూచించారు.

తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను ఆదిలోనే గుర్తించవచ్చని డాక్టర్ అనిత కొల్లి తెలిపారు. ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ నవీన వింధ్య చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నాట్స్ టెంపా బే చాప్టర్ కో ఆర్డినేటర్ రాజేష్ కుండ్రు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య అవగాహన సదస్సును నాట్స్ వాలంటీర్లు సహాయ సహాకారాలు అందించి విజయవంతం చేశారు. నాట్స్ బోర్డు సభ్యులు ప్రశాంత్ పిన్నమ్మనేని, బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ  సదస్సు నిర్వహణకు కీలక పాత్ర పోషించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా బోనాలు

అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం 

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి

ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం

ఎంఎఫ్‌ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్‌

ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం

హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు

తానా మహాసభలకు రాంమాధవ్‌కు ఆహ్వానం

సౌదీలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ తప్పనిసరి

అవగాహన లేకుంటే.. చిక్కులే

భారత సంతతి ప్రియా.. మిస్‌ ఆస్ట్రేలియా

ఎట్టకేలకు ‘ఎడారి’ నుంచి విముక్తి 

సైకియాట్రిస్ట్‌ ఝాన్సీ రాజ్‌ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ