అమెరికాలో ముగ్గుల పోటీలు

26 Apr, 2019 21:59 IST|Sakshi

సంబరాల సన్నాహాకంగా నాట్స్  ముగ్గుల పోటీలు

డల్హాస్: అమెరికాలో తెలుగు ఆడపడుచులు ముగ్గుల పోటీల్లో తమ కళాత్మకతను చూపెట్టారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో మే నెలలో డల్హాస్ వేదికగా జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాకంగా నాట్స్ నిర్వహిస్తూ పలు పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ డల్హాస్‌ విభాగం చేపట్టిన ముగ్గుల పోటీలకు చక్కటి స్పందన లభించింది. నాట్స్ నినాదానికి (భాషే రమ్యం సేవే గమ్యం) దగ్గరగా ఉన్న సుందరమైన చిత్రాన్ని ముగ్గు రూపంలో అందించిన గాయత్రి ఆలూరు మొదటి స్థానంలో నిలిచారు. వృక్షో రక్షతి రక్షితః అనే భావన ప్రతిబింబించేలా ముగ్గు వేసిన సంతోషి విశ్వనాధులకు రెండో స్థానంలో నిలిచారు.. దృష్టి, రక్షణ, రాజసం, ఆధ్యాత్మికత అన్న నాలుగు సందేశాలు అందిస్తున్న నెమలిని అందంగా ముగ్గు రూపంలో తీర్చిదిద్దిన శ్రీవాణి హనుమంతు మూడవ స్థానంలో దక్కించుకున్నారు. 

అమెరికా సంబరాలలో మహిళల జీవన సమతుల్యత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ‘నారీ సదస్సు’ సమన్వయ కర్త రాజేశ్వరి ఉదయగరి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గ్రిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట సహకరించారు. ముగ్గుల  పోటీలలో  పాల్గొన్న ప్రతీ మహిళను విజేతగా గుర్తిస్తున్నట్లు న్యాయ నిర్ణేతలు జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగ చెప్పారు. అమెరికా తెలుగు సంబరాలు మే 24 నుంచి 26 వరకు డల్హాస్‌లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటలో నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని సంబరాల కమిటీ వివరించింది.  “మనమంతా తెలుగు -మనసంతా వెలుగు” ఇతివృత్తం ఆధారంగా సంబరాలు జరుగనున్నాయని తెలిపింది.

శుక్రవారం ఆర్పీ పట్నాయక్, శనివారం మనో, ఆదివారం కీరవాణి.. ఇలా వరుసగా సంగీత కచ్చేరీలు, శివారెడ్డి మిమిక్రీ, అందరినీ అలరించడానికి మిల్కీ బ్యూటీ తమన్నా, ఇంకా తెలుగు వారి  ఆనందం కోసం వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అందరినీ ఉత్తేజపరిచే డ్యాన్సులతో ఈ సంబరాలు అంబరాన్నంటేలా జరగనున్నాయని సంబరాల కమిటీ వివరించింది. రుచికరమైన తెలుగు వంటకాలు, ఉత్తమ సాహితీ వేత్తలతో సాహితీ మకరందాలను పంచే కార్యక్రమాలు జరుగున్నాయని తెలిపింది. టికెట్ల కోసం www.sambaralu.org ను సంప్రదించవచ్చని పేర్కొంది. మే ఒకటో తేదీ లోపు టిక్కట్లు కొన్నవారికి ముప్పై శాతం డిస్కౌంట్ ఉన్నట్లు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ ఛైర్మన్  శ్రీనివాస్ తెలిపారు.

6వ అమెరికా సంబరాల కమిటీ కన్వీనర్ కిశోర్ కంచెర్ల, కమిటీ జాయింట్ కన్వీనర్  విజయ శేఖర్ అన్నె, వైస్ కన్వీనర్లు ఆది గెల్లి, ప్రేమ్  కలిదిండి, రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ డైరెక్టర్‌), భాను లంక (ఆతిథ్య నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల డైరెక్టర్‌), రామిరెడ్డి బండి (కార్యక్రమ డైరెక్టర్‌), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు  అభినందనలు తెలియజేశారు... సంబరాల్లో తెలుగువారంతా పాలుపంచుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు