సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఆహార పంపిణీ

25 May, 2020 16:13 IST|Sakshi

సెయింట్‌ లూయిస్‌: కరోనా విజృంభిస్తున్న తరుణంలో పేదలు, నిరాశ్రయులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) విసృత్తంగా సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే సెయింట్ లూయిస్‌లోని డౌన్టౌన్లో నాట్స్ 250 మందికి ఆహారాన్ని అందించింది. సేవా కార్యక్రమాలలో భాగంగా నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ నాయకులు సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ కో ఆర్డినేటర్ నాగ శ్రీనివాస్ శిష్ట్ల, వైఎస్ఆర్‌కే ప్రసాద్, సురేశ్ శ్రీ రామినేని, నరేశ్ చింతనిప్పు, శ్రీని తోటపల్లి, రమేష్ అత్వాల, అమేయ్ పేటే,  రఘు పాతూరి తదితర నాట్స్ ప్రతినిధులు ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరాశ్రయులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న నాట్స్ మానవత్వంతో సహాయం చేయడం అభినందనీయమని పలువురు సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు.

శ్రీ చరణ్ మంచికలపూడి, శ్రీరామ్ మంచికలపూడి, ఆదిత్య శ్రీరామినేని తదితర విద్యార్థి బృందం ఇందులో పాల్గొని తమ సేవా పథాన్ని చాటింది. సిగ్నేచర్ ఇండియా రెస్టారెంట్ ఆహారాన్ని తయారుచేసి తమ సహకారం అందించింది. సిక్స్ ఆఫ్ ఎస్టీఎల్ టీం కూడా నిరాశ్రయులకు ఆహారం అందించేందుకు తన వంతు సాయం చేసింది.  అమెరికాలో తెలుగుజాతికి అండగా నాట్స్‌ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 


 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు