హ్యూస్టన్‌లో నాట్స్ బాలల సంబరాలు

4 Feb, 2020 20:30 IST|Sakshi

హ్యూస్టన్ : విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో  బాలల సంబరాలను హ్యూస్టన్‌లో నిర్వహించింది. హ్యూస్టన్ రాష్ట్రంలోని మిస్సోరిలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్ననాట్స్ చిన్నారులకు మ్యాథ్స్ ఛాలెంజ్,తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహించింది. 8 ఏళ్ల లోపు చిన్నారులను జూనియర్, సీనియర్ల విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహించింది. మూడు విభాగాలలోను దాదాపుగా 120 మంది పిల్లలు తమ ప్రజ్ఞపాటవాలను ప్రదర్శించారు. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి నాట్స్ బహుమతులు అందచేసింది.

హ్యూస్టన్, గ్రేటర్ హౌస్టన్ నుండి దాదాపుగా 300 పైగా తెలుగువారు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దాదాపుగా నెల రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నాట్స్ వాలంటీర్లు విజయవంతం చేశారని  నాట్స్ హౌస్టన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను అన్నారు.  హ్యూస్టన్ నాట్స్ కోర్ కమిటీ సభ్యులు వీరూ కంకటాల,చంద్ర తెర్లి, విజయ్ దొంతరాజు తదితరుల పాల్గొన్నారు. ఈ కార్యాక్రమాన్ని విజయవంతం కావడంలో సహకరించిన తెలుగు భవనం, హ్యుస్టన్ తెలుగు సాంస్కృతిక కమిటీ(టీసీఏ), తెలంగాణ గ్రేటర్ హౌస్టన్ సంఘం(టీఏజీహెచ్) సభ్యులకు నాట్స్ హౌస్టన్ విభాగం కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు