యూకేలో తెలుగు భాష అభివృద్ధికి ఎన్‌ఎస్‌డీ కృషి

26 Apr, 2019 12:58 IST|Sakshi

లండన్‌ : యూకేలో తెలుగు భాష అభివృద్ధికి నవసమాజ్‌ దర్పణ్‌ (ఎన్‌ఎస్‌డీ) ముందడుగువేసింది. యూకేలో తెలుగు భాష నేర్చుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవని గమనించి నవసమాజ్‌ దర్పణ్‌ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. యూకేలో నివసిస్తున్న భారతసంతతి యువత, భవిష్యత్తుతరాల వారిలో తెలుగు భాష సజీవంగా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్‌ఎస్‌డీ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ పంజాల తెలుగు కిండర్‌గార్టెన్‌ పుస్తకాలను తురాక్‌ లైబ్రెరీస్‌ సర్వీస్‌ మేనేజర్‌ రోజలిన్‌ జోన్స్‌కు ఉచితంగా అందించారు. ఈ పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా డిస్‌ప్లేలో ఉంచుతామని జోన్స్‌ తెలిపారు.

ముందుగా ఇంగ్లండ్‌లో ఎస్సెక్స్‌ కౌంటీలో తురాక్‌ డివిజన్‌లోని లైబ్రరీలలో పుస్తకాలను పంపిణీ చేశామని, త్వరలో యూకే వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని లైబ్రెరీలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు శ్రీకాంత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు