ఇమ్మిగ్రేషన్ బిల్లు వల్ల భారతీయు నిపుణులకు లబ్ధి

20 Jul, 2013 16:32 IST|Sakshi

 నూతన ఇమ్మిగ్రేషన్ బిల్లు వల్ల యూఎస్లోని భారతీయ వృత్తి నిపుణులు లబ్ధి పొందుతారని అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతాధికారి వెల్లడించారు. అ దేశ ఉపాధ్యక్షుడు జోయి బిడెన్ భారత పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ ఉన్నతాధికారి ప్రసంగించారు. ఆ బిల్లు భారత్, అమెరిక దేశాలకు అత్యంత ప్రయోజనకారని ఆయన పేర్కొన్నారు. ఆ బిల్లు వల్ల అమెరికా తరలివచ్చే భారతీయ వృత్తి నిపుణులు సంఖ్య మరింత పెరిగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

అయితే దేశంలో హెచ్ 1 బీ వీసాపై అమెరికా వచ్చిన అత్యధికుల్లో భారతీయులే అధికమని ఉన్నతాధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ బిల్లులో తీసుకువచ్చిన సంస్కరణ వల్ల భారత్లోని వివిధ యూనివర్శిటీ విద్యార్థులు యూఎస్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అలాగే తాత్కాలిక ఉద్యోగం కోసం చేసేందుకు భారతీయులు యూఎస్ రావడానికి ఈ బిల్లు మార్గం సుగమం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు