నాపా చికాగో చాప్టర్‌ ఘనంగా ప్రారంభం

13 Feb, 2019 13:26 IST|Sakshi

చికాగో: నార్త్‌ అమెరికా పద్మశాలి అసోసియేషన్‌(నాపా) ఆధ్వర్యంలో చికాగోలోని బాలాజీ ఆలయంలో మార్కండేయ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో పాటు కొత్తగా నాపా చికాగో చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చికాగో చాప్టర్‌ డైరక్టర్‌గా నియమితులైన రాజ్‌ ఆడ్డగట్ల మాట్లాడుతూ.. మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న నాపా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.  చికాగో చాప్టర్‌ ఆధ్వర్యంలో తొలి సారి జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమం అనంతరం పసందైన వంటకాలతో అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం రామారావును సభ్యులు ఘనంగా సత్కరించారు. 

నాపా అధ్యక్షుడు అంజన్‌ క్రాంతి, మాజీ అధ్యక్షులు బాబురావు సామల, వేణు, శ్రీనివాస్‌ సాయిని, ప్రకాశ్‌ పెల్‌, రమేశ్‌ జి, మధు జింక, శరత్‌ రాపోలు, భద్రాది, శ్రీనివాస్‌ తాటిముల, రఘ డిడ్డి, చికాగో చాప్టర్‌ సభ్యులకు రాజ్‌ ఆడ్డగట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమారాజ్‌ అవదూత, ఈశ్వర్‌ జి, శ్రీనివాస్‌ వేముల, ప్రవీణ్‌ కటకం, విమల్‌, శ్రీనివస్‌ దామర్ల, శ్రీమాన్‌ వంగరి, శ్రీనివాస్‌ కైరంకొండ, రవి కూరపాటి, శ్రీరామ్‌ పసికంటి, రాజ్‌కుమార్‌, ఉమ, గీత, శ్రీదేవి, సునీత, విజయ, లక్ష్మి, నీలిమ, ప్రమోద, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.     


 


 

మరిన్ని వార్తలు