టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

1 Feb, 2020 17:14 IST|Sakshi

డల్లాస్‌: సూర్యుడు మకరరాశిలో చేరగానే వచ్చే పెద్ద  పండగ సంక్రాంతి. ఈ పండగ తెలుగువాళ్లకు ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుగుపుకుంటారు. అమెరికాలోని తెలుగువారి కోసం.. అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను  ఘనంగా నిర్వహించింది. స్థానిక నిమిట్స్ హైస్కూల్‌లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమం​లో అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాటలు, సంగీత, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి.

ఈ సంక్రాంతి సంబరాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ, పాలకమండలితో పాటు సమన్వయ కర్తలు తోపుదుర్తి ప్రబంద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని నిర్వహించారు. ఈ కార్యక్రమం చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఈ వేడుకలల్లో ముద్దుగారే యశోద, వందే మీనాక్షి, కృష్ణాష్టకం, మాస్ ఈజ్ గ్రేట్, చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమనికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్‌ పాడిన పాటలు అరించాయి.

టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థకి సేవ చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. అనంతరం 2020వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండాదన్నారు. తమ కార్యవర్గం, పాలకమండలి, సంస్థ సభ్యులని కలుపుకొని ఈ సంస్థను సేవారంగంలో కూడా ముందుంచి ఘన చరిత్రని కాపాడడానికి నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)ను తనకున్న అనుభవంతో, సమాజంలో ఉన్న పరిచయాలతో మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. తర్వాత 2020 కార్యవర్గం, పాలక మండలి బృందాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్ వారికి ఉత్తర టెక్సాస్ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారి  సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి, అతిధులకి, పోషకదాతలకి అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం ఈ కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరించిన నిజెల్ భవన నిర్మాణ సంస్థ, శరత్ యర్రం, రాం మజ్జి, టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషకదాతలైన తిరుమల్ రెడ్డి కుంభం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్  ఇండియన్  రెస్టారెంట్, క్వాంట్ సిస్టమ్స్, ప్రతాప్ భీమి రెడ్డి, విక్రం జంగం, డా. పవన్ పామదుర్తి, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్  దాసరి, డీఎంఆర్‌ డెవలపర్స్ , గోల్డ్ పోషకదాతలైన పసంద్ విందు, మై ట్యాక్స్ ఫైలర్, రాం కొనారా, స్వదేశి రమేష్ రెడ్డి , బసేరా హరి, కిషోర్ చుక్కాల ,టెక్ లీడర్స్ దేవేంద్ర రెడ్డి, సిల్వర్ పోషకదాతలైన మురళి వెన్నం, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, ఒమేగా ట్రావెలర్స్, అవాంట్ టాక్స్, విశ్వభారత్ రెడ్డి కంది, శ్రీకాంత్ గాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సంకక్రాంతి​ వేడుకులకు సహకరించిన మీడియా పార్ట్నర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్‌లతో పాటుగా వ్యాఖ్యాత సమీర ఇల్లందుని సన్మానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెరవెనుక నుంచి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారతీయ జాతీయగీతం ఆలాపనతో అత్యంత శోభాయమానంగా సాగిన సంక్రాంతి సంబరాలు ముగిశాయి.


 

మరిన్ని వార్తలు