వైఎస్‌ జగన్‌కు పవిత్ర జమ్‌ జమ్‌ను అందజేసిన ఎన్‌ఆర్‌ఐ

18 Apr, 2018 15:46 IST|Sakshi
మదీనా చిత్ర పటాన్ని వైఎస్‌ జగన్‌కు బహుకరిస్తున్న ముస్లిం సోదరులు

సాక్షి, మైలవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన ముస్లిం మైనార్టీ సభ్యులు పవిత్ర మక్కాలో పార్థనలు చేసి తమతో పాటు తెచ్చిన పవిత్ర ‘జమ్‌ జమ్‌’ నీళ్లను వైఎస్‌ జగన్‌కు అందజేశారు. మంగళవారం మైలవరంలో వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌ఆర్‌ఐ షేక్‌ సలీం సౌదీ నుంచి తెచ్చిన మదీనా చిత్ర పటాన్ని, ఖర్జురా పళ్లను ఆయనకు బహుకరించారు. సలీం సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. మా జననేతను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తాను సోషల్‌ మీడియాలో పార్టీ కోసం పని చేస్తున్నానని జగన్‌ గారికి తెలిపినట్టు, దానికి ఆయన అభినందించినట్టు పేర్కొన్నారు. ‘ఆప్‌ డరో మత్‌, మై ఆప్‌ కే సాత్‌ హై సమ్‌జో’ ( మీరు ఏం భయపడకండి, మీకు తోడుగా నేనున్నాను) అంటూ ఉర్దులో జగన్‌ గారు తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమురు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగు నాగార్జున, భట్టిప్రోలు మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్‌ ఇస్మాయిల్‌, గ్రామ అధ్యక్షులు మహ్మద్‌ జాని, సయ్యద్‌ నబి, మహ్మద్‌ అల్తాఫ్‌, పఠాన్‌ జాని, ఇర్షాద్‌ లు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు