డాలస్‌లో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

16 Jan, 2018 18:09 IST|Sakshi

డాలస్‌ : డాలస్‌ మహానగరంలో స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలను వైఎస్‌ఆర్‌ సీపీ ఎన్నారై వింగ్‌ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత హాజరై స్వామి వివేకానందుల వారు యువతకి ఎలా ఆదర్శప్రాయులు అయ్యారో.. ఎలా దిశా నిర్దేశం చేశారో గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ స్వామి వివేకానందుల వారు భారతదేశం ఒక మెల్టింగ్ పాట్ లాగా అన్ని మతాలను తనలో ఇముడ్చుకోగలిగింది అని 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత పార్లమెంట్ సదస్సులో చెప్పారని తెలిపారు.

అలాగే స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడితేనే అది జీవితమన్న స్వామి సూక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నిస్వార్థంగా ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. 
గరికపాటి రాము మాట్లాడుతూ యూనివర్సల్ ఆక్సెప్టేన్సీ, సహనం గురించి స్వామి ఆనాడే చెప్పారని అన్నారు. కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి యువతకి ఆదర్శ ప్రాయులని, బలమే జీవితం, బలహీనతే మరణం అన్న స్వామి వివేకానందుల వారి సూక్తిని యువత ఆదర్శవంతంగా తీసుకోవాలని కోరారు.

దేహం బలంగా వుంటే ఆలోచించే మెదడు కూడా బలంగా ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్నంత యువ శక్తి లేదని యువతకి దేశ భవిష్యత్‌ని మార్చే శక్తి ఉందని, యువత రాజకీయ రంగంలో కూడా దృష్టి పెట్టాలని కోరారు. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అన్నారు. కృష్ణ మోహన్ రెడ్డి కుందూరు మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తుందని స్వామి వివేకానందుల వారు ఏనాడో మనకి చెప్పారని గుర్తు చేశారు.

రమణ పుట్లూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద చేపినట్లుగానే ఏ పని చేసినా అందులో ధ్యాస పెట్టాలని యువతని కోరారు. సుబ్బారెడ్డి కొండూరు కార్యక్రమానికి విచ్చేసిన యువతకు ధన్యవాదాలు తెల్పి కార్యక్రమాన్ని ముగించారు. రాం గరికపాటి, సుబ్బారెడ్డి కొండూరు, ఉమా కుర్రి, శరత్ యర్రం, ఉదయ్, భాస్కర్, కులశేఖర్, ఉమా మహేష్, కిషోర్, జయచంద్ర, వెంకట్, వివేక్ తదితరులు కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

మరిన్ని వార్తలు