‘దిశ’కు ప్రవాసుల నివాళి

3 Dec, 2019 11:36 IST|Sakshi

డల్లాస్‌ : అమెరికాలోని ప్రవాసులు ‘దిశ’కు శ్రద్ధాంజలి ఘటించారు. డల్లాస్‌ నగరంలోని జాయి ఈవెంట్‌ సెంటర్‌ ఫ్రిస్కోలో శోకతప్త హృదయాలతో ‘దిశ’ బంధువులు అభినవ్‌ రెడ్డి, సింధూరిలతో కలిసి డల్లాస్‌ ఫోర్టువర్థ్‌ కమ్యూనిటీ నాయకులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దిశ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇంతటి ఘాతుకానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఆకృత్యాలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నా న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ స్వలాభం కోసం, రాజ్యాంగ సవరణలు చేయకుండా నాయకులు ఇలాంటి సంఘటనలను ఖండిస్తారే కానీ, దోషులను శిక్షించడానికి ఎన్నో సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు సందర్భానుసారంగా, ఆపదలో ఉన్నప్పుడు పోలీస్‌ సిబ్బందికి ఆసుపత్రి సిబ్బందికి, దగ్గరలో ఉన్నవారికి సమాచారం అందజేసే విధంగా తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముక్తకంఠంతో పలికారు. ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్‌ తోటకూర, అజయ్‌రెడ్డి, శ్రీధర్‌ కొరసపాటి, రావ్‌ కలవల, గోపాల్‌ పొన్నంగి, జానకి మందాడి, రఘువీర్‌ బండారు, పవన్‌ గంగాధర, చిన్న సత్యం వీర్నపు, పోలవరపు శ్రీకాంత్‌, చంద్ర పోలీస్‌, శారద సింగిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, సుధాకర్‌ కలసాని, మామిడి రవికాంత్‌ రెడ్డి, రామ్‌ అన్నాడి, అశోక్‌ కొండల, వేణు భాగ్యనగర్‌, సుంకిరెడ్డి నరేష్‌, తెలకపల్లి జయ, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, లింగారెడ్డి అల్వా తదితరులు పాల్గొన్నారు.   

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు