కర్ణాటక గెలుపుపై ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంబరాలు

19 May, 2018 10:50 IST|Sakshi

ఎడిసన్, న్యూ జెర్సీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంతో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ(ఆఫ్‌ బీజేపీ) ఆధ్వర్యంలో ఎడిసన్, న్యూ జెర్సీలో విజయ్ దివస్ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ అధికారప్రతినిధి జి.వి. ఎల్ నరసింహ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత దేశంలోని 29 రాష్ట్రాల్లో 23 బీజేపీ లేదా బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తోంది అని ఆఫ్‌ బీజేపీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల తెలిపారు. అదేవిధంగా, జనాభా పరంగా చుస్తే, దాదాపు 75 శాతానికి అధికంగా బీజేపీ లేదా బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తోంది అని చెప్పారు. అలాగే, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన కీలక పాత్రను గురించి వివరించారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ చేప్పట్టిన టెలీఫోనిక్, సోషల్ మీడియా ప్రచారాల వ్యూహాలను, వాటి ఫలితాలను అఫ్ బీజేపీ మీడియా కో-కన్వీనర్ దిగంబర్ ఇస్లాంపురే వివరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, వారి పార్టీలకు కంటిఫై నిద్ర లేకుండా చేశాయని జి.వి. ఎల్ నరసింహ రావు అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయన్నారు. తెలుగు రాష్ట్రలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రాజకీయ పార్టీలుగా కాకుండా వారి కుటుంబ పార్టీల వ్యాపారంగా మారిపోయిందని మండిపడ్డారు. కేవలం ఆయా కుటుంబాలకు, వారి కులాలకు, వారి సంబంధీకులకు సేవ చేసే వ్యవస్థలుగా తయారు అయ్యాయి అని చెప్పారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు తమ తమ వ్యవహార శైలిని మార్చుకోకపొతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పట్టుతుంది అని హెచ్చరించారు. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపితం అవడానికి ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ పని చేస్తోందని అఫ్ బీజేపీ జాతీయ యువ సహ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల పేర్కొన్నారు. అనంతరం ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షులు జయేష్ పటేల్, టీవీ ఆసియ వ్యవస్థాపకులు హెచ్‌ఆర్‌ షహ, సీనియర్ ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నేత ప్రమోద్ భగత్‌లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రాముఖ్యతను తెలిపారు. ఈ సంబరాల్లో ఆఫ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఆఫ్‌ బీజేపీ జాతీయ మండలి సభ్యులు కల్పన శుక్ల, జయేష్ పటేల్, బాల గురు, ఆఫ్‌ బీజేపీ న్యూ జెర్సీ కోఆర్డినేటర్ అరవింద్ పటేల్, ఆఫ్‌ బీజేపీ న్యూ జెర్సీ కోఆర్డినేటర్ గుంజన్ మిశ్ర, ఆఫ్‌ బీజేపీ మీడియా కో-కన్వీనర్  దిగంబర్ ఇస్లాంపురే, ఆఫ్‌ బీజేపీ జాతీయ యువ సహా-కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, దీప్ భట్, ఆఫ్‌ బీజేపీ న్యూ జెర్సీ యూత్ కన్వీనర్ పార్తీబన్, ఆఫ్‌ బీజేపీ న్యూ జెర్సీ యూత్ కో-కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర ఆఫ్‌ బీజేపీ నేతలు, ఆత్మ సింగ్, వంశీ యంజాలతో పాటూ అనేక సంఘాల నేతలు, పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు