కరాచీ విమానంలో భారతీయ ప్రయాణికుడికి గుండెపోటు

9 Jul, 2013 16:37 IST|Sakshi

గుండెపోటుతో బాధపడుతున్న భారతీయ ప్రయాణికుడొకరికి చికిత్స నిమిత్తం కరాచీలోని అంతర్జాతీయ విమానశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దింపారు.  ఇస్తాన్‌బుల్‌లోని టర్కీ నుంచి ముంబైకి వెళ్లే తూర్కిస్ విమానంలో 75 ఏళ్ల వాసన్ బాందోల్  ప్రయాణిస్తున్నారు. జూలై 6న వాసన్‌కు హఠాత్తుగా గుండె నొప్పి రావటంతో విమానాన్ని ల్యాండింగ్  చేయాల్సిందిగా కెప్టెన్ కోరారు. దీంతో పాకిస్తాన్ అధికారులు విమానాన్ని కరాచీలోని అంతర్జాతీయ విమానశ్రయంలో దింపేందుకు అనుమతినిచ్చారు.

 

భారతీయ ప్రయాణకుడిని చికిత్స నిమిత్తం విమానశ్రయ అధికారులు అఘా ఖాన్ ఆస్పత్రికి తరలించినట్టు పాకిస్తాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. బాందోల్ కుమారుడు జయంత్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమీషన్‌ను సోమవారం కలిశాడు. తన తండ్రిని చూసేందుకు తనకు అత్యవసర వీసాను ఇప్పించాల్సిందిగా కోరాడు. దీంతో హై కమీషన్ వెంటనే స్పందించి జయంత్‌కు అత్యవసర వీసాను అందించినట్టు హైకమీషన్ అధికార వర్గాలు పిటిఐకి తెలిపాయి.

మరిన్ని వార్తలు