ఆటా బాధ్యతలు స్వీకరించిన భీమ్‌రెడ్డి

20 Jan, 2019 20:13 IST|Sakshi

లాస్‌వెగాస్‌ : అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) కొత్త అధ్యక్షుడిగా పరమేష్‌ భీమ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లాస్‌ వెగాస్‌లో జరిగిన ఈ సమావేశంలో కరుణాకర్‌ అసిరెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడిగా పరమేష్‌  బాధ్యతలను స్వీకరించారు. తదుపరి అధ్యక్షుడిగా భువనేష్‌ భోజాలను ఎన్నుకున్నారు. 

జనవరి 19న ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దాదాపు 150మంది ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడిగా ఎన్నుకున్న పరమేష్‌ భీమ్‌రెడ్డి 2014 నుంచి ఆటాకు కన్వీనర్‌గా సేవలు అందించారు. ఈ సమావేశంలో మరికొందరి సభ్యుల్ని కూడా ఎన్నుకున్నారు. సెక్రటరీగా వేణుగోపాల్‌రావు సంకినేని, కోశాధికారిగా రవి పట్లోలా, జాయింట్‌ సెక్రటరీగా శరత్‌ వేముల, జాయింట్‌ ట్రెజరర్‌గా అరవింద్‌రెడ్డి ముప్పిడిని ఎన్నుకున్నారు. ఇంకా మిగతా 18మంది సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అరవింద్‌ ముప్పిడి, సతీష్‌ రెడ్డి, వేణు పిస్కే, రవి పట్లోలా, మధు బొమ్మినేని, సాయినాథ్‌ బోయపల్లి, రమేష్‌ నల్లవోలు, శ్రీనివాస్‌ దర్గుల, విజయ్‌ కొండూరు, వేణు సంకినేని, శ్రీకాంత్‌ గుడిపాటి, హరి లింగాల, సన్నీ రెడ్డి, సాయి సుదిని, రామకృష్ణ రెడ్డి, అనిల్‌ బొడ్డిరెడ్డి, రాజేశ్వర్‌ టెక్మల్‌, మెహర్‌ మేడవరం తదితరులను ఆటా సభ్యులుగా ఎన్నుకున్నారు. 2021-22 ప్రెసిడెంట్‌గా భువనేశ్‌ రెడ్డి భోజాలను ఎన్నుకున్నారు. 

మరిన్ని వార్తలు