నకిలీ గల్ఫ్‌ ఏజెంట్‌పై పీడీయాక్ట్‌

9 Aug, 2019 20:59 IST|Sakshi

గల్ఫ్‌కు పంపిస్తానని మోసం చేసిన మునుకుంట్ల వెంకటేశ్‌పై పీడీయాక్ట్‌ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం యెకిన్‌పూర్‌ గ్రామానికి చెందిన మునుకుంట్ల వెంకటేశ్‌ గల్ఫ్‌ దే శాలకు పంపిస్తామని వీసాలు, ఉద్యోగాలు ఇస్తామని అమాయక ప్రజలు, నిరుద్యోగ యువత నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడంతో పాటు అనేక నేరాలకు పాల్పడ్డాడు.  గల్ఫ్‌ ఏజెంట్లు, గల్ఫ్‌ దేశాల వీసాల ప్రక్రియ, ఆన్‌లైన్‌ సేవల గురించి పరిజ్ఞానం కలిగిన వెంకటేశ్‌ నకిలీ వీసాలు, టికెట్లను సృష్టించి ధనవంతులైన వ్యక్తుల నుంచి, నిరుద్యోగ యువకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశాడు. జిల్లా పరిధిలో ఇతనిపై వ ఫ్రాడ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఈక్రమంలో అతడిపై జగిత్యాల కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్భంద ఉత్తర్వులు చేశారు. దీంతో కరీంనగర్‌ జిల్లా జైలు అధికారి సమక్షంలో మల్యాల సీఐ నాగేందర్‌ పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు అందజేశారు. పీడీయాక్ట్‌ నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించిన మల్యాల సీఐ, ఎస్సై ఉపేందర్‌ను ఎస్పీ సింధూశ ర్మ అభినందించారు. గురువారం వెంకటేశ్‌ను కరీంనగర్‌ నుంచి వరంగల్‌ జైలుకు తరలించారు.  

మరిన్ని వార్తలు