విమాన ప్రమాదం నుంచి బయటపడటం అధ్బుతం: వేద్‌పాల్‌సింగ్

9 Jul, 2013 16:32 IST|Sakshi

అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్‌కో అంతర్జాతీయ విమానశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో నుంచి అనూహ్యరీతిలో తాము బ్రతికి బయటపడటం ఓ అధ్బుతమని భారతీయ ప్రయాణికుడు వేద్‌పాల్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ  ప్రమాదం చోటుచేసకున్న సమయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో  ఇద్దరు మృతిచెందగా, 180మంది వరకు గాయపడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన బోయింగ్ 777 ఆసియానా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.

 

అయితే విమానం ల్యాండ్ కాగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని చెప్పారు. పెలైట్ల నుంచి తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవని వేద్‌పాల్‌సింగ్ అన్నారు. కాగా, విమానంలో మొత్తం 307మంది ప్రయాణిస్తున్నారు. అయితే గత రాత్రి శాన్‌ప్రాన్సిస్‌కోఅంతర్జాతీయ విమానశ్రయంలో విమానం ల్యాడింగ్ అవుతున్న సమయంలో ఈ భయంకర దుర్ఘటన చోటుచేసుకుందని చెప్పారు. సియోల్ నుంచి శాన్ ప్రాన్సిస్‌కో వెళుతుండగా గట్టిగా తగిలినట్టు అనిపించిందని షేకన్ సింగ్ అనే వ్యక్తి చెప్పారు. ఆ విషయాన్ని ముందుగానే చెప్పివుంటే తాము బయటపడేందుకు ప్రయత్నించేవాళ్లమని వేద్‌పాల్‌సింగ్ అన్నారు. ఈ ప్రమాదంలో తనతోపాటు తన కుటుంబ సభ్యలు కూడా ఉన్నారన్నారు. కుటుంబంలో ఒకరికి భుజానికి ఎముక విరిగిందని, కొందరికి స్వల్పగాయాలయ్యాని తెలిపారు.

మరిన్ని వార్తలు