చికాగోలో ఘనంగా సాయి మహా సమాధి వందేళ్ల వేడుకలు

24 Oct, 2018 22:26 IST|Sakshi

చికాగో: సాయి మహా సమాధి అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది మొత్తం ‘శతాబ్ధి సోహాల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని యూఎస్‌ సాయి సంస్థాన్‌ నిర్ణయించింది. ఈ సందర్బంగా చికాగోలోని సాయిబాబా మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతోపాటు, రథయాత్ర, వంద నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో బాబాకు అభిషేకం నిర్వహించారు. అక్టోబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా చెప్పిన సూక్తులను, సాయి మహాత్యం గురించి నిర్వహకులు భక్తులకు వివరించారు. శతాబ్ది సోహాలలో భాగంగా ఆధ్యాత్మికత, అన్నదానం, పిల్లలకు ప్రేమ, సంస్కృతికై ఆరాధన, అవసరమున్న వారికి సహాయపడటం వంటి ఐదు నినాదాలతో ముందుకు సాగనున్నారు. 

సాయి మందిరంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలు ఆరాధన కార్యక్రమాలు చేపట్టారు.  పిల్లలు ఆలయంలో వంద పుష్పపు మొక్కలు నాటారు. అభిషేకం ఆత్మశుద్ధి, పుష్పాభిషేకం, ముక్తాభిషేకం, బిక్షా జోలితో పాటు దసరా వేడుకలు కూడా జరిపారు. శ్రీ సాయిసచ్ఛరితం విశిష్టతను తెలిపేలా భక్తులు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

మరిన్ని వార్తలు