సందడిగా సాయి దత్త పీఠం గురుకుల నాల్గొవ వార్షికోత్సవం

12 Jun, 2019 21:53 IST|Sakshi

భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రదర్శించిన చిన్నారులు

సౌత్ ప్లైన్ఫీల్డ్ : భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం గురుకుల నాల్గొ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భావితరాలకు భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని పరిచయం చేసేందుకు సాయి దత్త పీఠం గత నాలుగేళ్లుగా ఈ గురుకులాన్నినిర్వహిస్తోంది. యోగా, భారతీయ నృత్యం, శ్లోకాలు, ఇలా ఎన్నో మన సంస్కృతికి సంబంధించిన అంశాలు సాయి దత్త పీఠం గురుకులంలో బోధిస్తూ వస్తోంది. నాల్గో వార్షికోత్సవం సందర్భంగా ఐదు నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఐదు నుంచి ఏడేళ్ల లోపు చిన్నారులు యోగా, భజనలు, శ్లోకాలు, జయహో అంటూ చేసిన నృత్యానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శనలు చూసి తన్మయులయ్యారు. రెండో చిన్నారుల బృందం కూడా ఆధ్యాత్మిక ప్రదర్శనలు, యోగాలో వివిధ ఆసనాలను ఒక క్రమ పద్దతిలో వేసిన ఔరా అనిపించింది.
 
మూడో బృందం విష్ణు సహాస్ర నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జపం చేసిన తీరు ఆకట్టుకుంది. యోగా ఆసనాలతో నృత్యంతో మేళవింపు  చేసి.. చేసిన ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. ఐకమత్యమే మహాబలం అనే సందేశాన్ని చాటుతూ చిన్నారులు చేసిన ప్రదర్శనకు కరతాళ ధ్వనులతో  అందరూ హర్షం వ్యక్తం చేశారు. అందరు చిన్నారులు మహాలక్ష్మి అష్టకాన్ని అద్భుతంగా పఠించారు. చివరలో గురుకుల ఉపాధ్యాయులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. గురుకుల వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు, వాలంటీర్లను సాయి దత్త పీఠం సత్కరించింది. న్యూ జెర్సీ వాసులైన సంస్కృత ప్రొఫెసర్, స్కాలర్  రాజారావు బండారు, నాట్స్ మాజీ అధ్యక్షులు, డైరెక్టర్  మోహన కృష్ణ మన్నవ, ఫౌండర్ అండ్ సీఈఓ క్యూరీ లెర్నింగ్ సెంటర్, రత్న శేఖర్ మూల్పూరు లను సాయి దత్త పీఠం దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎడిసన్ బావార్చి వారు అందించిన స్నాక్స్ మరియు డిన్నర్ అందరి మన్నలను పొందింది.
Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

రాలిన ఆశలు

యూఏఈలో ఆర్థిక సంస్కరణలు

అవగాహన లోపంతోనే..

డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

చికాగోలో సాహితీ మిత్రుల సమ్మేళనం

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకలు

న్యూజెర్సీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఎన్నారై అనుమానాస్పద మృతి

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

సింగపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

అమెరికాలో స్వామీజీపై దాడి

ఆదుకునేవారేరీ..

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’

టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలో స్విట్జర్లాండ్‌కు ‘డిస్కోరాజా’

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!