గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా సాయి గొర్రెపాటి

10 Dec, 2019 21:07 IST|Sakshi

అట్లాంటా: అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్(గాటా) 10వ చీఫ్ కోఆర్డినేటర్‌గా సాయి గొర్రెపాటి ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 8న జరిగిన గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ వ్వవస్థాపక సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సమావేశాన్ని నిర్వహించి ఆయనను గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వ్వవస్థాపక సభ్యులు, నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాటా వ్యవస్థాపకులు తంగిరాల సత్యనారాయణ రెడ్డి, గిరీష్ మేక, సత్య కర్నాటి మాట్లాడుతూ.. గాటా గత 10 సంవత్సరాలుగా చేసిన వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

ఇక చీఫ్ కోఆర్డినేటర్‌ సాయి గొర్రెపాటి మాట్లాడుతూ.. 10వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించారు. అట్లాంటాలోని ఇన్ఫినిటి ఎనర్జీ సెంటర్‌లో వచ్చే ఏడాది మే 29,30 వరకు జరగబోయే ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ తరలి రావాలని గాటా నూతన కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు.అలాగే గాటా నిర్వహకులు గౌతమ్ గోలి, కిరణ్ పాశం, రవి కందిమళ్ళ, అరుణ్ కాట్పల్లి, తదితరులు సాయి గొర్రెపాటికి శుభకాంక్షలు తెలుపుతూ గాటా కన్వెన్షన్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.


Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా