సింగపూర్‌లో వైఎస్సార్‌కు కన్నీటి నివాళి

12 Feb, 2019 15:28 IST|Sakshi

సింగపూర్ వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానేత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా తొలి షోను 700 మందికి పైగా వీక్షించారు. సింగపూర్‌లోని రెక్స్‌ సినిమా గోల్డెన్‌ మైల్‌ టవర్‌ థియేటర్‌ జోహార్‌ వైఎస్సార్‌ నినాదాలతో మారెమోగిపోయింది. యాత్ర చిత్రాన్ని సింగపూర్‌లో తెలుగు ప్రజలతో వీక్షించేందుకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్‌కి సింగపూర్ వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కృతజ్ఞతలు తెలిపింది.

సినిమా అద్భుతంగా ఉందని, పెద్దాయన వైఎస్సార్ జీవితాన్ని ప్రత్యక్షంగా చూసినట్టుందని, సినిమా హాలు నుండి బయటకు వస్తూ వీక్షకులు ప్రజానేత రాజన్నను తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. పెద్దాయన రాజశేఖర రెడ్డి మరణించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడనడానికి ప్రేక్షకుల కన్నీటి నివాళే ఉదాహరణ అని సింగపూర్ వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపు జోహార్ వైఎస్సార్ నినాదాలతో థియేటర్ హోరెత్తింది. సింగపూరులో ఉండే వైఎస్సార్ అభిమానులతో పాటు అసంఖ్యాక తెలుగు కుటుంబాలు చిత్ర ప్రదర్శనకు మెదటి రోజు మొదటి షోకి రావడం తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారి అని తెలిపారు. 

పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాజన్నని జనం ఎంతగా ప్రేమిస్తున్నారో యాత్ర చిత్రానికి వస్తున్న ఆధరణ చూస్తుంటే అర్థమవుతుందన్నారు. యాత్ర తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోతున్న ఒక అద్భుత చిత్రం అని కొనియాడారు. సింగపూర్‌లో ఉండే తెలుగు కుటుంబాలు వైఎస్సార్ జీవితాన్ని తమ పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్నజీవితం ఈ తరానికే కాదు, రాబోయే తరాలకు ఆదర్శప్రాయం అనివైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు పేర్కొన్నారు.

తాను కూడా వైఎస్సార్ సింగపూర్ కుటుంబసభ్యులతో యాత్ర చిత్రాన్ని థియేటర్‌లో చూడడం ఆనందంగా ఉందని మార్గాని భరత్‌ అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఎంత ఆవశ్యకమో వివరించారు. సింగపూర్‌లో వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు చేస్తున్న కార్యక్రమాలను మార్గని భరత్ అభినందించారు.

మరిన్ని వార్తలు