యూఎస్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక విమానం

4 Jun, 2020 17:19 IST|Sakshi

నెవార్క్ : కరోనా నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. కాగా ఈ విమానం జూన్‌ 9(వచ్చే మంగళవారం)నెవార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. ప్రవాంసాంధ్రుల తరపున రవి పులి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌ కింద ప్రైవేట్‌ ఛార్టర్‌ విమానానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్‌ డౌన్‌ కారణంగా అమెరికాలో చిక్కుకున్న తెలుగు వారితో పాటు, ఓసీఐ  కార్డు హోల్డర్లు ప్రయాణం చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. కాగా విమానంలోని ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ చేరుకోగానే క్వారంటైన్‌ లో ఉంటామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా హైదరాబాద్‌ రావాలనుకున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది మంచి అవకాశం. రిజిస్ట్రేషన్‌ కోసం కింద లింక్‌ను క్లిక్‌ చేయండి.
http://www.usism.org/register-private-charter-flight.html

మరిన్ని వార్తలు