ఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 8న నారీ

21 Aug, 2018 14:44 IST|Sakshi

సింగపూర్‌ : సింగపూర్‌ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా లేడిస్‌ నైట్‌ ఈవెంట్‌ 'నారి-2018'ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌కే రోజా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. సింగపూర్‌లోని ఆర్చర్డ్‌ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి యాంకర్‌ ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. టాలీవుడ్‌ సింగర్‌ సమీరా భరద్వాజ్‌ తన గాత్రంతో అలరించనున్నారు.

మిస్‌, మిసెస్‌ సింగపూర్‌ తెలుగు సమాజం, షార్ట్‌ ఫిలిమ్‌ పోటీలు, మహానటి థీమ్ వస్త్రధారణ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు భారీ ఎత్తున స్థానిక మహిళలు హాజరవ్వాలని సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్‌ 8న సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు స్వాతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆటా, పాటలతో పాటూ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కార్యదర్శి సత్యచిర్ల పేర్కొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు