టీపీఎల్‌ 2018 చాంపియన్స్‌గా కూల్‌ క్రూజర్స్‌

20 Aug, 2018 11:20 IST|Sakshi

లండన్‌ : తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌(తాల్‌) ఆధ్వర్యంలో తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌(టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ను మిడిల్‌సెక్స్‌లో నిర్వహించారు. క్రాన్‌ ఫోర్డ్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌లో హెస్టన్‌ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో విజేతలకు స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా అవార్డులను ప్రదానం చేశారు. కూల్‌ క్రూజర్స్‌‌, మార్చ్‌ సైడ్‌ కింగ్స్‌ జట్లు ఫైనల్‌ వరకు చేరుకోగా, బ్లూ క్యాప్స్‌, యూనైటెడ్‌ టైటాన్స్‌ జట్లు మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. కూల్‌ క్రూజర్స్‌ టీపీఎల్‌ 2018 చాంపియన్స్‌గా నిలవగా, మార్చ్‌ సైడ్ కింగ్స్‌ రెండో స్థానం, యునైటెడ్‌ టైటాన్స్‌ మూడోస్థానంలో నిలిచాయి. టీపీఎల్‌లో పవన్‌ కుమార్‌ సీహెచ్‌ ఆల్‌రౌండర్‌గా రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, బెస్ట్‌ బౌలర్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. 

టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన టీపీఎల్‌ కమిటీ సభ్యులు సునీల్‌ నాగండ్ల, వంశీ రక్నర్‌, శ్యామ్‌ భీమ్‌రెడ్డి, శ్రీధర్‌ సోమిశెట్టి, వంశి పొన్నం​లకు తాల్‌ స్పోర్ట్స్‌ ట్రస్టీ మురళీ తాడిపర్తి కృతజ్ఞతలు తెలిపారు. టీపీఎల్‌ సలహాదారులు రవిసుబ్బా, సంజయ్‌ భిరాజు, శరత్‌ జెట్టి, వాలంటీర్ల చేసిన కృషిని టీఏఎల్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌ మేడిచెట్టి అభినందించారు.


 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వలస పోయిన ఓటు

అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి

బ్రిటన్‌ వర్సిటీల్లో తగ్గిన భారతీయుల చేరిక

గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ వరాలజల్లు

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి సంపత్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'సైరా' మ్యూజిక్‌ డైరెక్టర్‌ లైవ్‌ కన్సర్ట్‌

ఆమిర్‌ సినిమాకు పెట్టుబడి కూడా రాదా..?

స్టార్‌ హీరో సీరియస్‌ వార్నింగ్‌

బ్యాక్‌ టు ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అంటోన్న సుధీర్‌ బాబు!

‘వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను’

మీటూ.. నా రూటే సపరేటు!