ఇంటర్నెట్‌లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’

28 May, 2020 12:04 IST|Sakshi

‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ను ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ప్రారంభిస్తున్నామని తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి వెల్లడించారు. మే 31నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని సాహితీ ప్రియులంతా పాల్గొనాలని సూచించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తానా మరో ముందడుగు వేస్తోందని  అన్నారు. ఇకపై ప్రతి నెల చివరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. (వలస కూలీలకు ఎన్‌ఆర్‌ఐల బస్సు ఏర్పాటు)

మొదటి సమావేశం ఈ ఆదివారం (మే 31) నాడు రాత్రి 9.30 నిమిషాలకు (అమెరికా  సమయం ఉదయం11:00) ప్రసారం కానుందని తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్‌ అన్నారు. ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిధిగా ప్రముఖ జానపద ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద రావు  తన బృంద సభ్యులతో జానపద గానాలతో కనువిందు చేయనున్నారని పేర్కొన్నారు. (చిక్కినట్టే చిక్కి పంజా విసిరింది.. )

ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు,  ఫోటో కవితలు, పద్యాలు, పాటలు, బాల సాహిత్యం  లాంటి వివిధ అంశాలలో ప్రపంచ వ్యాప్తం గా పోటీలు నిర్వహిస్తామని, మే నెల నుంచి ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం జరుపుతామని ప్రకటించారు. (ఆమె లేకుండా ‘పని’ అవుతుందా! ) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ ఈ దృశ్య సమావేశంలో ఈ క్రింది ఏ మాధ్యమాల ద్వారా నైనా  పాల్గొనవచ్చని ఆహ్వానం పలికారు. 

1. Webex Link:

https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40

2. Facebook:

3. Join by phone: USA: 1-408-418-9388 Access code: 798 876 407

>
మరిన్ని వార్తలు