డాలస్‌లో 141వ నెల నెలా తెలుగువెన్నెల సాహిత్య సదస్సు

23 Apr, 2019 10:41 IST|Sakshi

డాలస్, టెక్సస్‌ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 141 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థయొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారి మాడ సమన్విత ప్రార్థనా గీతాన్ని ఆలపించి ప్రారంభించింది. తెలిదేవర మంజు శిష్యులు వెంపటి సీత, శ్రీలత మల్లాడి, చిరంజీవి గెడ్డశ్రీయ హృద్యంగా వీణా వాద్యంతో ముందుకు సాగిన ఉగాది కవి సమ్మేళనంలో డా. ఊరిమిండి నరసింహారెడ్డి రవీంద్రుని గీతాంజలి, మాడ మాడ్దయాకర్ కవితా గానం, మద్దుకూరి చంద్రహాస్ సోషల్ మీడియా పోస్ట్‌లపై రాసినస్వీయ కవిత, మల్లవరపు అనంత్ స్వీయ రచన "కొంటెతామర", కన్నెగంటి చంద్ర స్వీయ కవిత "మళ్ళీ ఇంకో వసంతం", పుదూర్ జగదీశ్వరన్ స్వీయ రచనతో సాగి వేముల లెనిన్ జాషువా లఘు ఖండిక "గిజిగాడు" సమీక్షతోముగిసింది. చిన్నారులు వేముల సాహితీప్రియ, వేములసింధూర, మాడ సమన్విత కందుకూరి రచన "ఎంత చక్కనిదోయి ఈ తెలుగు" అంటూచక్కగా పాడి ప్రశంసలు అందుకున్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి డా.రాజ్యశ్రీకేతవరపు రచించిన వంద ప్రశ్నలు-వేలభావాలు పుస్తకావిష్కరణ జరిగింది. ప్రముఖ విశ్లేషకులు నియోగి రచయిత్రి కవిత్వంపై రాసిన సాహిత్య విశ్లేషణ, తనకుసంధించిన 100 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు పొందుపరిచి ఈ పుస్తకం ప్రచురించినట్లు తెలిపారు. పుస్తకంపై జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు వీర్నపుచినసత్యం స్పందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినప్రముఖ రచయిత్రి డా.రాజ్యశ్రీ కేతవరపు "షడ్రుచులసమ్మేళనం-కవిత్వం" అనే అంశంపై ప్రసంగించారు. ప్రతిరుచికి చక్కని ఉదాహరణలతో అనర్గళంగా సాగినప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. గీతామృతంలో భగవద్గీతలో శ్లోకాలను సామాన్యమానవుడికి అర్థమయ్యేరీతిలో రాయడంలో తనఅనుభవాలను వివరించారు. ముఖ్యఅతిథి భట్రాజు రాణిని పుష్పగుచ్ఛముతో సత్కరించి సమన్వయకర్తగా వ్యవహరించి అట్లూరి స్వర్ణ సభకు పరిచయం చేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు వీర్నపు చినసత్యం, పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డసుబ్రహ్మణ్యం, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి దుశ్శలువా, సాహిత్యవేదిక బృందసభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. ఉపాధ్యక్షులు పాలేటిలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు మండిగ శ్రీలక్ష్మి సాహిత్య వేదిక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
వీర్నపు చినసత్యం ముఖ్య అతిథి ప్రసంగంపై స్పందిస్తూగత ఐదు సంవత్సారాలుగా పలుమార్లు తెలుగు వెలుగుపత్రికకు కథలు కవితలు అందిస్తున్న రచయిత్రిని ఈవిధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు