టాంటెక్స్‌ 2020 నూతన కార్యవర్గం

7 Jan, 2020 16:40 IST|Sakshi

టెక్సాస్‌: తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)-2020 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 5న డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడుగా కృష్ణారెడ్డి కోడూరు పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాంటెక్స్‌ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్‌ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్‌ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలను చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో ఈ ఏడాదిలో అందరిని అలరించే కార్యక్రమాలు చేయనున్నామన్నారు.

దీనికి స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు తెలిపారు. గతేడాది టాంటెక్స్ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. కృష్ణా రెడ్డి కోడూరు నేతృత్వంలో ఏర్పడిన 2020 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

టాంటెక్స్‌ నూతన అధికారిక కార్యనిర్వాహక బృందం
అధ్యక్షుడు: కృష్ణా రెడ్డి కోడూరు
ఉత్తరాధ్యక్షురాలు: లక్ష్మి పాలేటి 
ఉపాధ్యక్షులు: ఉమా మహేష్ పార్నపల్లి
కార్యదర్శి: సతీష్ బండారు
కోశాధికారి: శరత్ ఎర్రం  
సంయుక్త కార్యదర్శి: మల్లిక్ కొండా  
సంయుక్త కోశాధికారి: కల్యాణి తాడిమేటి
తక్షణ పూర్వాధ్యక్షులు: చిన సత్యం వీర్నపు 
మిగతా సభ్యులు: శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చంద్ర పొట్టిపాటి, రఘునాధ రెడ్డి కుమ్మెత్త, స్రవంతి ఎర్రమనేని, సరిత కొండా, ప్రభాకర్ రెడ్డి మెట్టా, చంద్రారెడ్డి పోలీస్, వెంకట్ బొమ్మా, జనార్దన్ యెనికపాటి, లోకెష్ నాయుడు కొణిదల, నాగరాజ్ చల్లా, ఉదయ్ నిడగంటి, భాను ప్రకాష్ వెనిగల్ల.

నూతన పాలక మండలి బృందం
అధిపతి: పవన్ రాజ్ నెల్లుట్ల
ఉపాధిపతి: డా. పవన్ పామదుర్తి
మిగతా సభ్యులు: శ్రీకాంత్ పోలవరపు, వెంకట్ ములుకుట్ల, ఇందు రెడ్డి మందాడి, శ్రీలక్ష్మి మండిగ, ఎన్‌ఎంఎస్‌ రెడ్డి.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా