టెక్సాస్‌లో ఉగాది ఉత్సవాలు

18 Apr, 2019 20:38 IST|Sakshi

టెక్సాస్‌ : ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. వికారినామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. సంబరాల్లో మునిగితేలారు. యూలెస్‌లోని ట్రినిటి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. 150కి పైగా పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరించారు.

టాంటెక్స్ 2019 ‘ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాట్యం, సమాజ సేవ, సాంకేతిక, వైద్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో కిరణ్ ప్రభ , సంగీతం రంగంలో శ్రీనివాస్ ప్రభల, నాట్యం రంగంలో శ్రీమతి శ్రీలత సూరి, సమాజ సేవ రంగంలో శ్రీకాంత్ పోలవరపు . సాంకేతిక రంగంలో డా. సాంబారెడ్డి, వైద్యరంగంలో డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి , డా. కోసూరి రాజు మొదలైన వారికి ఈ పురస్కారాలను అందజేశారు. వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న, అవినాష్ వెల్లంపాటి, కిరణ్మయి వేములలకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) ’ పురస్కారంతో సత్కరించి వారి సేవా ధృక్పదాన్ని పలువురికి చాటారు. జీవన సాఫల్య పురస్కారం డా. ప్రేమ్‌రెడ్డికి ఇచ్చారు.

ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ట్రినిటీ హైస్కూల్ సూపరింటెండెంట్ డా. స్టీవ్ చాప్మన్ మాట్లాడుతూ తెలుగు వారి విశిష్టత మరియు సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత డా. స్టీవ్ చాప్మన్ను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు  చినసత్యం వీర్నపు.. ట్రినిటీ హైస్కూల్ ఆడిటోరియంను ఉచితంగా ఇప్పించిన డా. తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాకారుల సన్మాన కార్యక్రమంలో భాగంగా గాయకులు సుమంగళి, నరేంద్ర, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లం రమేష్, వ్యాఖ్యాత రఘు వేముల లకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గబృందం సభ్యులు సత్కరించారు.

మరిన్ని వార్తలు