టాంటెక్స్‌ ఆధ్వర్యంలో తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు

25 Feb, 2020 14:59 IST|Sakshi

డల్లాస్‌ : తెలుగు సంఘం సాహిత్య వేదిక (టాంటెక్స్‌) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఆదివారం ఫిబ్రవరి 23న డల్లాస్‌లోని  శుభం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సాహిత్య వేదిక సమన్వయకర్త మల్లిక్ రెడ్డి కొండా, కృష్ణ రెడ్డి కోడూరు అధ్యక్షతన జరిగింది. కాగా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విజయా సారధి జీడిగుంట విచ్చేశారు. వీరు ముందు గా ప్రార్ధన గీతం తో సభను ప్రారంభించారు . ఈ సదస్సుకు సాహితీ వేత్తలు భాషాభిమానులు విచ్చేసారు. కార్యక్రమం ఆసాంతం వాల్మీకీ రామాయణం, అన్నమాచార్య కీర్తనలు, అనంతరం విజయ సారధి జీడిగుంట  'నన్నయ కవితా రీతులు-పామరుని విశ్లేషణ' అంశం పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మల్లిక్ రెడ్డి కొండా, కృష్ణ రెడ్డి, విజయ్ సారధి, ఎన్‌ఆర్‌యూ,లెనిన్,సుబ్బు,చినసత్యం,ప్రసాద్తోటకూర,సుధా కల్వకుంట,రాజారెడ్డి, ఉమాదేవి,శరత్‌, వెంకట్,అశ్వని వెలివేటి,రవి పట్టిసం,శశి పట్టిసం,వేణు భీమవరపు,విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా