ఘనంగా ముగిసిన టాంటెక్స్ స్వరమంజరి వేడుకలు

30 Dec, 2015 20:25 IST|Sakshi
ఘనంగా ముగిసిన టాంటెక్స్ స్వరమంజరి వేడుకలు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  స్థానిక గాయనీ గాయకులకు నిర్వహించిన  ‘స్వరమంజరి’ పాటల పోటీల ముగింపు ఉత్సవం డిసెంబర్ 5న ఘనంగా జరిగింది. డాల్లస్ లోని 'జాక్ షింగ్లీ' ఆడిటోరియంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ పోటీ్లో తుది విజేతకు స్వర్ణ పతకం అందించారు.


స్థానికంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకు రావటం ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ పోటీల్లో బారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్  ఊరిమిండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగి కార్యక్రమంలో ప్రమఖ  గేయ రచయిత చంద్రబోసు ముఖ్య అతిథిగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. స్థానిక న్యాయనిర్ణేతలు రాజశేఖర్ సూరిభోట్ల, .శ్రీనివాస్ ప్రభల, టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ లు వ్యవహరించారు.

ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శారద సింగిరెడ్డి, టాంటెక్స్ కార్యదర్శి మహేష్ ఆదిభట్ల, సంయుక్త కార్యదర్శి చినసత్యం వీర్నపు, కోశాధికారి కృష్ణవేణి శీలం, సంయుక్త కోశాధికారి వేణు పావులూరి,  మరియు కార్యవర్గ సభ్యులు వెంకట్ దండ, శ్రీలక్ష్మీ మండిగ, శ్రీనివాస్ రెడ్డి గుర్రం తదితరులు పాల్గొన్నారు. తుది పోటీలో ప్రభాకర్ కొట, పూజిత కడిమిసెట్టి, ఆషాకీర్తి లంక, సంగీత మరిగంటి, సాయిరాజేష్ మహాభాష్యం, జానకి శంకర్ లు తలపడ్డారు. కాగా.. జానకీ శంకర్ బంగారు పతకాన్ని గెలుచున్నారు. సాయి రాజేష్ రెండో స్థానంలో, పూజిత కడిమి సెట్టి మూడో స్థానంలో నిలిచారు.

 

మరిన్ని వార్తలు