సియాటిల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

2 Oct, 2019 14:19 IST|Sakshi

సీటెల్‌: బతుకమ్మ పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉ‍న్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సియాటిల్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తయారు చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సంబరాలకు సియాటిల్‌ నలుమూలల నుంచి 4000 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమానికి తెలుగు సినీపరిశ్రమకు చెందిన యాంకర్‌ అనసూయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన గాయని స్వాతి కూడా యూకే నుంచి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వీరిద్దరు తమదైన శైలిలో అక్కడున్న వారితో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది.

బోథెల్‌ వాలంటీర్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ఏడడుగుల బతుకమ్మ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్‌మండ్‌ జట్టు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధోల్‌ తాషా సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్‌గా నిలిచాయి. టాటా సియాటిల్‌ బృందం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి, బోర్డు డైరెక్టర్లు నవీన్‌ గోలి, ప్రదీప్‌ మెట్టు, ఆర్‌వీపీ గణేష్‌, మనోహర్‌, నిక్షిప్త, అజయ్‌, ఆర్‌సీ శ్రీకాంత్‌, శివ అధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన టాటా సియాటిల్‌ బృందం సభ్యులను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతూ, కార్యక్రమానికి హాజరైనవారందరూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. టాటా సియాటిల్‌ బృందం ఈ కార్యక్రమాన్ని స్థానిక తెలంగాణ అసోసియేషన్స్‌ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా), తెలుగు అసోసియేషన్ వాట్స్ (వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్) తో కలిసి నిర్వహించింది.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోస్టన్‌లో ఇళయరాజా పాటల హోరు

డాలస్‌లో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు

అక్టోబర్ 12, 13న సింగపూర్‌లో తిరుమల శ్రీవారి కల్యాణం

5న సంబవాంగ్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు

ఘనంగా "టాక్ - చేనేత బతుకమ్మ - దసరా" సంబరాలు

డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

పల్లె సేవలో ప్రవాసులు

స్టాండింగ్‌ కమిటీలో ఇద్దరు తెలంగాణ ఎంపీలు

గల్ఫ్‌ వల.. యువత విలవిల

అంగరంగ వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలు

మహాత్మా గాంధీకి ఎంపీ లింగయ్య యాదవ్ ఘన నివాళి

వాషింగ్టన్‌ డి.సిలో వైఎస్సార్‌కు ఘనమైన నివాళి

మామిడిపండ్లు దొంగిలించాడని దేశ బహిష్కరణ

ప్రభుత్వాసుపత్రికి 20 కోట్లు ఇచ్చిన పూర్వవిద్యార్థులు

డాలర్‌ సిరి.. హెచ్‌ 1బీ వీసా ఉంది మరి

టాంటెక్స్‌ ఆధ్వర్యంలో ఫణినారాయణ వీణా మహా స్రవంతి

టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

అమెరికాలో భారత యువకుడి మృతి

ఆస్ట్రేలియాలో గణేష్ చతుర్థి వేడుకలు

సునీల్‌ గావస్కర్‌ నయా ఇన్నింగ్స్‌..

న్యూజెర్సీలో తెలంగాణా విమోచన దినోత్సవం

అక్కినేని అంతర్జాతీయ అవార్డులు ప్రకటన

ఆ విషయంలో మనోళ్లే ముందున్నారు!

సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం

గావస్కర్‌ నయా రికార్డ్‌!

ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టిన భారతీయుడు

‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’

చికాగో తెలుగు సంఘాల సమర్పణలో ‘అర్ధనారీశ్వరం’

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హిట్‌ సినిమా హక్కులు కొన్న చిరంజీవి

సైరా హిట్‌.. మెగా ఫ్యామిలీ సంబరం

‘అన్నా ఏమైంది.. ఇలా ఉన్నారేంటి?’

బిగ్‌బాస్‌ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!

సైరా కటౌట్‌ అంటే ఆమాత్రం ఉండాలి!

‘సైరా’ మూవీ రివ్యూ