టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు

12 Apr, 2019 12:08 IST|Sakshi

టొరంటో : తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ టోరంటో(టీసీఏజీటీ) ఆధ్వర్యంలో మెగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టొరంటోలోని బిషప్‌ ఆల్లెన్‌ అకాడమీ క్యాథలిక్‌ సెకండరీ స్కూల్‌లో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. టీసీఏజీటీ సెక్రటరీ దేవి చౌదరి ప్రాంభోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. టోరంటో చుట్టు పక్కన ప్రాంతలైన మర్కమ్‌, బ్రాంప్టన్‌, మిస్సిసౌగా, ఓక్‌విల్లే, వాటర్‌డౌన్‌, కిట్చెనర్‌, వాటర్‌లూ, కేంబ్రిడ్జి, హామిల్టన్‌, మిల్టన్‌లతో పాటూ ఇతర ప్రాంతాలనుంచి వందలాది కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.

గత ముప్పై ఏళ్లుగా టీసీఏజీటీ అందిస్తున్న సేవలను ప్రెసిడెంట్‌ కోటేశ్వరరావు పోలవరపు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, ట్రస్టీలు, స్పాన్సర్లు, వాలంటీర్లుకు ఛైర్మన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ సూర్య బెజవాడ, దేవి చౌదరిలు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు