ఘనంగా టీడీఎఫ్‌ 20వ వార్షికోత్సవ వేడుకలు

3 Nov, 2019 20:02 IST|Sakshi

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్)-యూఎస్‌ఏ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. టీడీఎఫ్‌-యూఎస్‌ఏ జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకల కమిటీ ఈ కార్యక్రమాన్ని నవంబర్‌ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించనుంది. అమెరికాలోని తెలంగాణ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని కమిటీ తెలిపింది. రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, యాంకర్‌ ఉదయభాను కార్యక్రమానికి హాజరవుతారని కమిటీ వెల్లడించింది.

వేడుకల వివరాలు..
నవంబర్ 8 : సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమాలు.. అనంతరం విందు
నవంబర్‌ 9 : ఉదయం జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకల ప్రారంభోత్సవం. ప్రముఖుల కీలక ఉపన్యాసాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం మధ్యాహ్న విందు. మధ్యాహ్నం బ్రేక్ అవుట్ సెషన్‌లో భాగంగా బిజినెస్‌, వైద్యం, రాజకీయ, ప్రాజెక్టులు, మహిళలు, అక్షరాస్యత పలు అంశాల మీద చర్చ. అనంతరం సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ‘తెలంగాణ నైట్‌’లో భాగంగా సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు.

టీడీఎఫ్ నేషనల్‌ కాన్ఫరెన్స్‌.. రిజిస్ట్రేషన్‌ ఇలా..
కార్యక్రమంలో భాగమయ్యేందుకు ముందుగా రిజిస్ట్రేషన్‌చేసుకోవల్సిందిగా ‌జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకల కమిటీ నిర్వాహకులు సూచించారు. కిందిలింక్‌ల రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
https://www.tdf20years.com/registration


ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, ఆహ్వానితులు వీరే.. 

1. తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌, 2. జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ వెదిరే, 3.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి,  4.ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్, 5.పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి, ఎర్రబెల్లి దయాకర్‌రావు 6.భువనగిరి పార్లమెంట్‌ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, 7.మల్కాజ్‌గిరి ఎంపీ రెవంత్‌రెడ్డి, 8. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, 9.ఎమ్మెల్సీ  పి.మహేందర్‌రెడ్డి,  10.ఎమ్మెల్సీ  ఎన్‌. రామచందర్‌ రావు, 11.మానకొండూర్‌ ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్‌,12. ఎమ్మెల్సీ పీ. రాజేశ్వర్ రెడ్డి, 13.మునుగోడు ఎమ్మెల్యే కే. రాజ్‌గోపాల్‌రెడ్డి, 14. జడ్పీ చైర్మన్‌  గండ్రా జ్యోతీ, 15. సినీ నిర్మాత దిల్‌ రాజ్‌, 16.గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, 17సంగీత దర్శకుడు  కే. కార్తీక్‌ , 18.గాయకుడు, తెలంగాణ ప్రభుత్వ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, 19.మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేషన్‌ రాజు, 20.మోటర్‌ బైకర్‌  జై భారతీ,  21. ఇండియన్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు వి. రవికాంత్‌ రెడ్డి,  22.మైహోం గ్రూప్స్ చైర్మన్  డా. రామేశ్వర్‌ రావు జూపల్లి, 23. మాజీ అమెరికా అంబాజీడర్ వినయ్‌ తుమ్మలపల్లి,   24.హేల్త్‌ కేర్  ఎంటర్ ప్రిన్యూర్ డా. దేవయ్య పగిడిపాటీ, 25. సీఎర్రా అట్లాంటిక్‌ సీఈఓ రాజురెడ్డి, 26. నవ్యా వెంచర్స్‌ ఎండీ పీ దయాకర్‌, 27. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సెక్రటరీ శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, 28. ప్రముఖ యాంకర్‌ ఉదయభాను.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా