పోర్ట్‌లాండ్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు

5 Nov, 2018 18:36 IST|Sakshi

పోర్ట్‌లాండ్‌ : అమెరికాలోని ఒరేగాన్‌స్టేట్‌లో టీడీఎఫ్‌ (తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌) పోర్ట్‌లాండ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోర్ట్‌లాండ్‌ చైర్మన్‌ శ్రీని అనుమాండ్ల విఘ్నేశ్వరుడికి పూజ, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల, అమ్మాయిలు, మహిళలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన తరువాత దసరా పండుగను జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకల అనంతరం పసందైన విందులను ఆరగించారు. 

ఈ సందర్భంగా శ్రీని అనుమాండ్ల మాట్లాడుతూ.. వేడుకలకి వచ్చిన వారందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికి ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహాయం చేసిన స్పాన్సర్స్‌కి శ్రీని కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీఎఫ్‌ టీమ్‌ మెంబర్స్‌ నిరంజన్‌ కూర, నరేందర్‌ చీటి, భాను పోగుల, కొండల్‌ రెడ్డి పుర్మ, మధుకర్‌ రెడ్డి పురుమాండ్ల, రాజ్‌ అందోల్‌, శ్రీనివాస్‌రెడ్డి పగిడి, రఘు శ్యామ, సురేష్‌ దొంతుల, జయాకర్‌ రెడ్డి ఆడ్ల, సత్య సింహరాజు, వీరేష్‌ బుక్క, అజయ్‌ అన్నమనేని, వెంకట్‌ ఇంజమ్‌, హరి సూదిరెడ్డి, శ్రీని గుబ్బ, వెంకట్‌ గోగిరెడ్డి, ఇతర వాలెంటెర్స్‌ అందరికీ  ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు